కరోనా విషయంలో ప్రపంచం అనేక ఇబ్బందులు పడుతుంటే, భూటాన్ మాత్రం కరోనాను కట్టడి చేయడంలో చురుకైన పాత్రను పోషించి శభాష్ అనిపించుకుంటోంది. 7 లక్షలకు పైగా ఉన్న జనాభా కలిగిన భూటాన్ ఎత్తైన, కోండలు, పర్వత ప్రాంతాలతో నిండి ఉంటుంది. ప్రజలు మైదాన ప్రాంతాల్లో కంటే కొండ ప్రాంతాల్లోనే ఎక్కువగా నివశిస్తుంటారు. అలాంటి చోట్ల కరోనా వ్యాపిస్తే పరిస్థతి ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో వైద్యసేవలు అందించడం కూడా కష్టం అవుతుంది.…
ఏపీలో ఇంటర్ పరీక్షలు రద్దు కావడంతో తెలంగాణలో స్కూల్స్ లో ప్రత్యక్ష తరగతుల పై సందేహాలు మొదలయ్యాయి. ఆ పరీక్షల రద్దు జులై ఒకటి నుండి తెలంగాణలో ప్రారంభం కానున్న ప్రత్యక్ష తరగతుల పై ప్రభావం పడే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తెలంగాణ లోను విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతుల పై ప్రభుత్వం పునరాలోచించే అవకాశం ఉందని అంటున్నారు విద్యా శాఖ వర్గాలు. అయితే ఇప్పటికే తెలంగాణ లో విద్యా సంస్థలు…
కరోనా మహమ్మారికి చెక్‌పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్… దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది… మొదటల్లో ప్రజల్లో భయం ఉన్నా.. క్రమంగా వ్యాక్సిన్ సెంటర్లకు వచ్చేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది.. ఇక, వ్యాక్సిన్ల కొరతతో కొంత కాలం తెలంగాణలో వ్యాక్సిన్ వేయడమే నిలిపివేసిన పరిస్థితి.. కానీ, ఇప్పుడు రాష్ట్రంలోనూ వ్యాక్సినేషన్ చురుకుగా సాగుతోంది.. రాష్ట్రంలో నేటితో కోటి డోసులు పూర్తి చేసినట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది.. ఇప్పటి వరకు తెలంగాణలో 1,00,53,358 డోసుల వాక్సినేషన్ వేశామని… అందులో…
కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో.. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేస్తున్న కరోనా మందుపై పెద్ద చర్చే జరిగింది.. ప్రభుత్వం జోక్యం చేసుకోవడం.. ఆ మందను పరిశీలించడం.. వ్యవహారం హైకోర్టు వరకు వెళ్లడం.. ప్రభుత్వం ఆనందయ్య మందుకు అనుమతి ఇవ్వడం అన్నీ జరిగిపోయాయి.. అయితే, తాజాగా.. ఆనందయ్య మందుపై మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనాకు మందు తయారుచేసి ఉచితంగా ఇస్తున్నారంటూ ఆనందయ్యను అభినందించింది మద్రాసు హైకోర్టు.. ఆనందయ్యకు న్యాయమూర్తులు జస్టిస్…
డెల్టా వేరియంట్ ప్రపంచంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇండియాలో సెకండ్ వేవ్‌కు కారణమైన డెల్టా వేరియంట్ ఇప్పటికే అనేక దేశాల్లో వ్యాపించింది. ఇప్పుడు ఈ వేరియంట్ కేసులు ఆస్ట్రేలియాను భయపెడుతున్నాయి. మొదటివేవ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొన్న ఆస్ట్రేలియాలో డెల్టాకేసులు వేగంగా వ్యాపిస్తున్నాయి. సిడ్నినగరంలో ఈ కేసులు బయటపడ్డాయి. దీంతో ఆ నగరంలోని అనేక ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించి ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. Read: ఈటల చేరిక : తెలంగాణ బీజేపీలో నేతల వర్గపోరు? ఏయిర్‌పోర్ట్ లోని…
కరోనా కాలంలో మాస్క్ ధరించడం కామన్ అయింది. మాస్క్‌లేకుండా బయటకు వస్తే కరోనా నుంచి ప్రమాదం పొంచి ఉన్నది. దీంతో దాదాపుగా ప్రజలు మాస్క్ లేకుండా బయటకు వచ్చేందుకు ఇష్టపడటంలేదు. కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ప్రజలు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది మాస్క్ పెట్టుకోకుండా బయటకు వస్తున్నారు. వీరి నుంచి మిగతావారికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. Read: బీహార్‌లో వింతకేసుః కలలోకి వచ్చి అత్యాచారం చేస్తున్నాడని… అంతేకాకుండా థర్డ్ వేవ్ ముప్పుకూడా పొంచి ఉందనే…
సెకండ్ వేవ్‌లో కరోనా కేసులు పెరగడంతో నెలక్రితం లాక్‌డౌన్ విధించించింది తెలంగాణ ప్రభుత్వం. నిత్యావసర సరుకుల కోసం కొంత సమయం మినహాయింపు తప్పా.. విద్యాసంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. ఆ తరువాత దశల వారీగా సడలింపులు ఇచ్చింది. తాజాగా కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుతుండడంతో.. లాక్‌డౌన్ ఎత్తేసింది ప్రభుత్వం. ఆల్ ఓపెన్ అంటూనే.. జులై ఒకటో తేదీ నుంచి విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందు కోసం విధి విధానాలను కూడా రూపొందించాలని విద్యాశాఖను ఆదేశించింది.…
కరోనాతో ఇప్పటికే అల్లాడిపోయిన దేశ ప్రజలను డెల్టా ప్లస్ వేరియంట్.. మరింత భయపెడుతోంది. దేశంలో ఈ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ వేరియంట్ కారణంగానే మూడో వేవ్ ముంచుకొచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నానాటికీ ప్రమాదకరంగా మారుతోంది డెల్టా ప్లస్..! ఇప్పుడు ఏకంగా ప్రాణాలను బలి తీసుకుంటోంది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కొవిడ్ సోకి మే 23న ప్రాణాలు కోల్పోయారు. ఆమె రక్తనమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయగా.. ఆమెకు డెల్టా ప్లస్…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,088 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 9 మంది కరోనాబారినపడి మృతిచెందారు.. ఇదే, సమయంలో 1511 మంది కరోనా బాధితులు కోలుకున్నారు.. దీంతో… పాజిటివ్ కేసుల సంఖ్య 6,17,776కు పెరగగా… రికవరీ కేసులు 5,98,139కి చేరగాయి.. ఇక, ఇప్పటి వరకు కోవిడ్‌తో 3,607 మంది మృతిచెందినట్టు బులెటిన్‌లో…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గింది.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 88,622 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… 4,981 మంది పాజిటివ్‌గా తేలింది.. కోవిడ్ బారినపడి మరో 38 మంది మృతిచెందారు.. తాజాగా మృతుల్లో చిత్తూరు జిల్లాలో 10 మంది, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున, గుంటూరు, నెల్లూరులో నలుగురు చొప్పున, శ్రీకాకుళం, పశ్చిమగోదావరిలో ముగ్గురు చొప్పు. అనంతపూర్, కడప, విశాఖపట్నం,…