దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నా డెల్టాప్లప్ వేరియంట్ నుంచి ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తుండటంతో రాష్ట్రాలు అప్రమత్తం అవుతున్నాయి. దేశంలో కరోనా సెకండ్ వేవ్‌కు డెల్టా వేరియంట్ ప్రధాన కారణం అయింది. ఈ వేరియంట్ కారణంగానే కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. ఇకపోతే, ఇప్పుడు దేశాన్ని డెల్టాప్లస్ వేరియంట్ భయపెడుతున్నది. ఇప్పటికైతే ఈ వేరియంట్ కేసులు తక్కువగా నమోదైతున్నప్పటికీ, రాబోయో రోజుల్లో ఈ వేరియంట్ నుంచి థర్డ్ వేవ్ ముప్పు ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read: బికినీలో బాలీవుడ్ బార్బీ హాట్ ట్రీట్
మహారాష్ట్రలో ఈ వేరియంట్ కు సంబందించి ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో తిరిగి కఠిన ఆంక్షలు విధించింది. సాయంత్రం 4 గంటల వరకే రాష్ట్రంలో దుకాణాలకు అనుమతి ఇచ్చింది థాకరే సర్కార్. మొదటి, రెండో వేవ్ ల కారణంగా అత్యధిక కేసులు, మరణాలు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర ఉన్నది. రెండు వేవ్‌ల నుంచి నెర్చుకున్న అనుభవాల దృష్ట్యా సర్కార్ మూడో వేవ్ నుంచి బయటపడేందుకు ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది.