ఫేక్ న్యూస్‌పై సీరియస్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్… కోవిడ్‌పై సమీక్ష సందర్భంగా పత్రికా కథనాలను ప్రస్తావిస్తూ.. తప్పుడు కథనాలపై తీవ్రంగా స్పందించారు సీఎం.. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంతో రాష్ట్రానికి మంచిపేరు వచ్చిందనే తప్పుడు వార్తలు రాస్తున్నారని ఫైర్ అయ్యారు.. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించడమే వీటివెనుక ఉద్దేశమని విమర్శించిన సీఎం… అందుబాటులో 70 శాతానికి పైగా ఆక్సిజన్ బెడ్లు, 70 శాతానికిపైగా వెంటిలేటర్లు ఉన్నాయని.. ఇలాంటి పరిస్థితుల్లో ఆక్సిజన్ కొరతతో రోగులు చనిపోతున్నారని ఎలా రాయగలుగుతున్నారు? అంటూ మండిపడ్డారు.. కోవిడ్ ప్రభావాన్ని చులకనచేసి చూశామంటూ మరో పత్రికలో నిస్సిగ్గు రాతలు రాశారంటూ ఫైర్ అయిన ఏపీ సీఎం.. కనీస విలువలు పాటించకుండా ఈ రాతలు రాస్తున్నారని ఆరోపించారు.. ముఖ్యమంత్రి పదవి స్థాయిని దిగజార్చడమే వారి ఉద్దేశం అన్నారు.. బాగా పనిచేసినప్పుడు.. మంచి పేరు వస్తుందని.. నాకు మాత్రమే కాదు.. అధికారులకు కూడా మంచిపేరు వస్తుందని.. కానీ, మనస్సుల్లో కుతంత్రాలు పెట్టుకుని తప్పుడు కథనాలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, ఆ కథనాలపై చట్టప్రకారం, న్యాయప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు..!