ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రోజువారీ కేసులు భారీ స్థాయిలో తగ్గుతుండటం విశేషం. చాలా రోజుల తరువాత నలభైవేలకు దిగువున పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కేంద్రం కరోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 37,566 కేసులు నమోదయ్యాయి.
Read: ‘ఒకే ఒక జీవితం’ అంటున్న శర్వానంద్!
దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,16,897కి చేరింది. ఇందులో 2,93,66,601 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 5,52,659 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 907 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 3,97,637 మంది మృతిచెందారు. ఇక, గడిచిన 24 గంటల్లో 56,994 మంది కోలుకొని డిశ్చార్జ్ కావడం విశేషం.