కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ కొరత కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దేశంలో సరిపడా ఆక్సిజన్ ఉన్నప్పటికీ, దానిని ఒకచోట నుంచి మరోక చోటికి తరలించేందుకు సరైన వసతులు లేకపోవడంతో ఈ ఇబ్బందులు తలెత్తాయి. ఆక్సిజన్ ట్యాంకులు అంటే పెద్దగా ఉంటాయి. పెద్దగా ఉండే ట్యాంకర్లను వెంటబెట్టుకొని తిరగాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సెకండ్ వేవ్‌లో వచ్చిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని శానిటైజర్ మాదిరిగా చిన్నగా ఉండే ఆక్సిజన్ బాటిల్‌ను రూపోందించారు ఐఐటి కాన్పూర్ పూర్వవిద్యార్ధి.
Read: ఇండియాలో భారీగా పెరిగిన కరోనా కేసులు…
ఈ స్పిన్ టెక్నాలజీ ఆధారంగా చిన్నగా ఉండే బాటిల్‌ను తయారు చేశారు. ఎవరికైన ఆక్సిజన్ అత్యవసరైపుడు చిన్న బాటిల్‌లోని ఆక్సిజన్‌ను అందిస్తూ ఆసుపత్రికి తరలించవచ్చని చెబుతున్నారు. చిన్న బాటిల్ ధర రూ.499గా నిర్ధారించారు. అత్యవసర సమయాల్లో వీటిని వినియోగించవచ్చని డాక్టర్ సందీప్ పాటిల్ పేర్కొన్నారు. థర్డ్ వేవ్ ముప్పు ఉందని వస్తున్న వార్తల నేపథ్యంలో ముఖానికి మాస్క్‌తో పాటుగా ఒక జేబులో శానిటైజర్, మరోజేబులో ఆక్సీజన్ బాటిల్ పెట్టుకొని వెళ్లోచ్చన్నమాట.