ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 63,849 శాంపిల్స్‌ను పరీక్షించగా, 1461 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,85,182కి చేరింది. ఇందులో 19,52,736 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 18,882 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కరోనాతో 15 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 13,564కి…
ఈ నెల 16వ తేదీ నుంచి ఏపీలో స్కూళ్లను రీ-ఓపెన్ చేస్తున్నాం అని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. రెగ్యులర్ టైమింగ్సులోనే స్కూళ్లను రన్ చేస్తాం అని అన్నారు. ఇక కోవిడ్ ప్రొటోకాల్ పాటించేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 95 శాతం మంది టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తైంది. వ్యాక్సిన్ వేయించుకోని మిగిలిన టీచర్లకు కూడా టీకాలు వేయాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించాం. ఆన్ లైన్ తరగతులు రాష్ట్రంలో ఎక్కడా జరగడం లేదు అని పేర్కొన్నారు.…
భారత్‌లో కరోనా రోజువారి కేసులు కొన్నిసార్లు స్థిరంగా కొనసాగుతున్నా.. మరికొన్నిసార్లు హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య 30 వేల దిగువకు పడిపోయింది… ఇంత తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడం 147 రోజుల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా 15,11,313 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 28,204 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 373 మంది కరోనా బాధితులు…
డెల్టా వేరియంట్.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వేరియంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో పరిస్థితి మళ్లీ చేజారుతున్నట్లు కనిపిస్తోంది. అక్కడ ఒక్క రోజే లక్షకు పైగా కేసులు రావడం కలకలం రేపింది. జూన్‌లో అత్యంత తక్కువగా నమోదైన కేసులు.. ఇప్పుడు మళ్లీ పీక్‌కి చేరుకోవడంతో అగ్రరాజ్యం అప్రమత్తమైంది. ఒక శుక్రవారం రోజే లక్షా 30 వేలకు పైగా కొత్త కేసులు బయటపడ్డాయి. జూన్ నెల చివరిలో రోజువారీ కేసులు 11 వేలకు పడిపోయాయి. కానీ,…
తెలంగాణ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఐదు వందల దిగువకు చేరిన తర్వాత స్థిరంగా కొనసాగుతోంది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 453 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ముగ్గురు కరోనా బాధితులు కన్నుమూశారు.. ఇదే సమయంలో 614 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,49,859కు చేరుకోగా……
ఈఏడాది కూడా స్వాతంత్ర్యదినోత్సవాన్ని గోల్కొండ కోటలోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 15 వ తేది ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్… ఇవాళ బీఆర్కే భవన్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన సీఎస్.. స్వాతంత్ర్యదినోత్సవం కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రం లో గత 24 గంటల్లో నిన్న ఉదయం 9 గంటల నుంచి ఇవాళ ఉదయం 9 గంటల వరకు 54,455 శాంపిల్స్ పరీక్షించగా.. 1,413 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 18 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు.. చిత్తూరులో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, తూర్పు గోదావరి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో…
చైనాలో మళ్లీ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయింది. మధ్యస్త, తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి రాజధాని బీజింగ్‌కు వచ్చే వారిపై నిషేదం విధించింది. కరోనా తీవ్రత ఉన్న ప్రాంతాల నుంచి వచ్చే రైలు, రోడ్డు, విమాన మార్గాలపై కూడా నిషేదం విధించింది చైనా ప్రభుత్వం. ఎవరైనా సొంత వాహనాల్లో ఆయా ప్రాంతాల నుంచి రావాలనుకున్నా వారిని మధ్యలోనే నిలువరించేందుకు ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసింది. మధ్యస్త, తీవ్రత…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. కరోనా కారణంగా అమెరికా ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. వ్యాక్సినేషన్ వేగంగా అమలు చేస్తున్నా కేసులు తగ్గినట్టే తగ్గి మరలా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య సైతం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కరోనా విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యాక్సిన్ ను వేగంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. ట్రయల్స్ దశలో ఉండగానే ఆర్డర్లు కూడా ఇచ్చేశారు. తాజాగా ట్రంప్ ఓ మీడియాకు ఇంటర్యూ ఇస్తూ కీలక…