కరోనా కేసులు, తీవ్రత మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తప్పని సరిగా జాగ్రత్తులు తీసుకొవాల్సిందే. మాస్క్ పెట్టుకోకుంటే జరిమానాలు విధిస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ మనుషులకే కాదు, దేవుళ్లకు కూడా తగిలింది. 2020లో లాక్‌డౌన్ సమయంలో దేవాలయాలు మూసేశారు. సామాన్యభక్తులను అనుమతించలేదు. శ్రీరామ నవమి నుంచి దసరా వరకు అందరూ ఇంట్లోనే నిర్వహించుకున్నారు. కనీసం ఈ ఎడాదైనా అలా జరగకుండా ఉంటుందేమో అనుకుంటే, కాదని అంటున్నారు నిపుణులు. థర్డ్‌వేవ్ ప్రమాదం ముంచుకొచ్చే ప్రమాదం ఉండటంతో ఆలయాల్లోని దేవుళ్లకు మాస్క్‌లు తొడుగుతున్నారు. బెంగాల్‌లో దుర్గాదేవిని కొలుస్తుంటారు. దుర్గాదేవి పరాక్రమానికి ప్రతీక. దసరా ఉత్సవాల కోసం ఇప్పటి నుంచే విగ్రహాల తయారీ అవుతున్నాయి. కోల్‌కతాలోని బిగుయాటీ మండపంలో దుర్గామాత అమ్మవారికి బంగారంతో చేసిన మాస్క్, చేతిలో శానిటైజర్, ఆక్సీమీటర్, థెర్మోగన్, సిరంజీ వంటివి ఉంచారు. కరోనా నుంచి కాపాడాలని కోరుకుంటూ అమ్మవారి విగ్రహాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు చెబుతున్నారు.
Read: మహేష్ కోసం “ఎస్‌ఎస్‌ఎమ్‌బి 28” స్పెషల్ వీడియో