ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రం లో గత 24 గంటల్లో నిన్న ఉదయం 9 గంటల నుంచి ఇవాళ ఉదయం 9 గంటల వరకు 54,455 శాంపిల్స్ పరీక్షించగా.. 1,413 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 18 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు.. చిత్తూరులో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, తూర్పు గోదావరి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు చొప్పున, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు మరణించారు. ఇక, ఒకేరోజు 1,795 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.
రాష్ట్రంలో నేటి వరకు 2,52,47,884 శాంపిల్స్ పరీక్షించగా.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 19,83,721కు చేరింది… రికవరీ కేసుల సంఖ్య 19,50,623 కు పెరగగా… ఇప్పటి వరకు మృతిచెందిన కోవిడ్ బాధితుల సంఖ్య 13,549కు పెరిగింది.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 19,549 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం. అయితే, ఇవాళ కోవిడ్ కేసులు భారీగా తగ్గడానికి.. టెస్ట్‌ల సంఖ్య కూడా తగ్గించడమే కారణంగా చెప్పవచ్చు.