కరోనా దెబ్బకు వర్కింగ్ స్టైల్ మొత్తం మారిపోయింది… చిన్న సంస్థల నుంచి బడా కంపెనీలు వరకు ప్రపంచవ్యాప్తంగా వర్క్‌ఫ్రం హోం బాట పట్టాయి… పరిస్థితులు కొంత అదుపులోకి వచ్చిన తర్వాత మళ్లీ ఉద్యోగులను ఆఫీసుకు రప్పిస్తున్నారు.. మరికొన్ని బడా సంస్థలు సైతం.. ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం అమలు చేస్తూనే ఉంది.. ఈ నేపథ్యంలో ఇంటి నుంచే పని విధానంపై కీలక నిర్ణయం తీసుకుంది గూగుల్.. సెప్టెంబరు నుంచి ఆఫీసుకు రావాలంటూ తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులను కోరింది.…
తెలంగాణలో కరోనా కేసులు ఈరోజు తగ్గాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 449 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి… మరో ఇద్దరు మృతిచెందారు.. ఇదే సమయంలో 623 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,49,406 కు చేరుకోగా.. ఇప్పటి వరకు 6,37,175 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. మృతుల సంఖ్య 3,825 కు పెరిగింది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు…
ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ… తగ్గుతున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 2,050 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,82,308 కు చేరింది. ఇందులో 19,48,828 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 19,949 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 18 మంది…
ప్రపంచాన్ని డెల్టా వేరియంట్ అతలాకుతలం చేస్తున్నది. కేసులు భారీ స్థాయిలో పెరగడానికి, తీవ్రత పెరగడానికి ఆ డెల్టా వేరియంట్ ప్రధాన కారణం. అమెరికాలో సైతం కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇండియా పొరుగుదేశం శ్రీలంకలోనూ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. డెల్టా వేరియంట్ కేసులు అధికమవ్వడంతో ఆ దేశం కీలక హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు ఇంటివద్దనే ఉండాలని, సాద్యమైనంత వరకు బయటకు రాకుండా ఉండేందుకు ప్రయత్నించాలని కోరింది. డెల్టా వేరియంట్ కారణంగా ఆసుపత్రులపై ఒత్తిడి పెరిగినట్టు…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ వ్యాక్సిన్. వ్యాక్సిన్ ఒక్కటే ఆయుధంగా మారింది. ప్రపంచంలో ఇప్పటికే పలురకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అభివృద్ది చెందిన దేశాల్లో వ్యాక్సిన్ కొరత లేకున్నా, టీకాలు తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావడంలేదు. దీంతో అనేక సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు వివిధ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అయినప్పటికీ వ్యాక్సినేషన్ మందకోడిగా సాగుతున్నది. అమెరికాలో కరోనా వ్యాప్తి తగ్గినట్టే తగ్గి, తిరిగి పెరుగుతున్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని…
అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా 60 వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే, ఈ వేడుకల్లో అనేక మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. మొదట ఈ వేడుకలకు 500 మందికి పైగా అతిధులను పిలవాలని అనుకున్నా, కరోనా ఉధృతి కారణంగా ఆ సంఖ్యను తగ్గించారు. ఈ వేడుకలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఎందుకంటే, ఈ వేడుకలకు హాజరైన వారిలో చాలామంది మాస్క్ పెట్టుకోలేదని, ప్రస్తుతం అమెరికాలో కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయని, సెలబ్రిటీలు మాస్క్ పెట్టుకోకుండా…
తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులు కాస్త పెరిగాయి.. 1,05,201 శాంపిల్స్ పరీక్షించగా… 569 మందికి పాజిటివ్‌గా తేలింది… మరో నలుగురు కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 657 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,48,957 కు చేరగా… కోలుకున్నవారి సంఖ్య 6,36,552 కి పెరిగింది.. ఇక,…
భారత్‌లో రోజువారీ కరోనా కేసులు 40 వేల వరకు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా 500 లకు పైగానే నమోదవుతున్నది. సెకండ్ వేవ్ కు కారణమైన డెల్టా వేరియంట్ కేసులు అధికంగా ఉండటంతో కేంద్రం అప్రమత్తం అయింది. పలు రాష్ట్రాల్లో ఆర్ ఫ్యాక్టర్ 1 దాటినట్టు గణాంకాలు అందటంతో ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. సెకండ్ వేవ్ పీక్స్‌లో ఉండగా ఆర్ ఫ్యాక్టర్ 1.4కి చేరింది. కేసులు తగ్గుముఖం పట్టిన తరువాత ఇది 0.7కి చేరింది. అయితే, ఇప్పుడు…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టాలంటే తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. ప్రస్తుతం దేశంలో కోవీషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వీ టీకాలు అందుబాటులో ఉన్నాయి. భారత్‌లో 50 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించారు. గత కొన్ని రోజులుగా దేశంలో ప్రతి రోజూ 50 లక్షలకు పైగా టీకాలు వేస్తున్నారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న టీకారు రెండు డోసుల టీకాలు. రెండు డోసులు తప్పని సరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఇదిలా ఉంటే, జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్…
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్రలో రోజువారీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. దీంతో పొరుగునున్న రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కర్ణాటక రాష్ట్రం కరోనాను కట్టడి చేసే క్రమంలో ఆంక్షలు విధించేందుకు సిద్ధమయింది. రాత్రిసమయంలో కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలుచేయాలని నిర్ణయం తీసుకున్నారు. అత్యవసర్ విభాగాలకు నైట్ కర్ఫ్యూ నుంచి సడలింపులు ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే…