చైనాలో మళ్లీ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయింది. మధ్యస్త, తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి రాజధాని బీజింగ్‌కు వచ్చే వారిపై నిషేదం విధించింది. కరోనా తీవ్రత ఉన్న ప్రాంతాల నుంచి వచ్చే రైలు, రోడ్డు, విమాన మార్గాలపై కూడా నిషేదం విధించింది చైనా ప్రభుత్వం. ఎవరైనా సొంత వాహనాల్లో ఆయా ప్రాంతాల నుంచి రావాలనుకున్నా వారిని మధ్యలోనే నిలువరించేందుకు ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసింది. మధ్యస్త, తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎల్లో, రెడ్ కోడ్ ను అమలు చేస్తున్నారు. ఈ కోడ్ ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు ఎవరూ కూడా ఆ కోడ్ ఆకుపచ్చ కు మారే వరకు బీజింగ్ వెళ్లేందుకు అవకాశం ఉండదు. కోడ్ మారిన తరువాత కూడా తప్పని సరిగా టెస్టుల్లో నెగిటివ్ వస్తేనే అనుమతి ఇస్తారు. దాదాపుగా 17 ప్రావిన్సుల్లో కరోనా కేసులు తిరిగి నమోదవ్వడంతో 15 నగరాలపై గట్టి నిఘాను ఏర్పాటు చేశారు.