తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 482 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఇద్దరు కరోనా బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 455 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,50,835కు చేరుకోగా… ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 3,833కు పెరిగింది.. ఇక,…
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ స్పీడందుకుంది. కరోనా వ్యాప్తి కూడా తగ్గుముఖం పట్టింది. దాంతో బడి తలుపులు తెరుచుకుంటున్నాయి. ఈ ట్రెండ్ అన్ని దేశాలలో కనిపిస్తోంది. స్థానిక పరిస్థితులకు అనుగునంగా 50 కి పైగా దేశాలలో ఇప్పటికే స్కూళ్లు రీ ఓపెన్ అయ్యాయి. తెరుచుకుంటున్న బడి తలుపులు దాదాపు ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారి మానవాళిని పట్టి పీడిస్తోంది. అన్ని రంగాలపై అది తీవ్ర ప్రభావం చూపింది. కరోనా దెబ్బకు కుదేలైన వాటిలో విద్యా ఒకటి.…
కరోనా మహమ్మారి రోజుకో కొత్త వైరస్‌లో వివిధ వేరియంట్లలో భయపెడుతూనే ఉంది.. ప్రస్తుతం అమెరికా, చైనా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది డెల్టా వేరియంట్.. అయితే, కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి తయారు చేసిన వ్యాక్సిన్లు ఈ వేరియంట్‌పై ఎంత వరకు ప్రభావం చూపుతాయనే దానిపై పలు వాదనలు ఉన్నాయి.. కొన్ని అధ్యయనాల్లో.. అవి ఎంతవరకు సమర్థవంతంగా పనిచేస్తాయి అనేది కూడా తేల్చాయి.. తాజాగా.. రష్యా తయారు చేసిన పై స్పుత్నిక్ వి..…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కొత్త కేసులు పెరుగుతూ… తగ్గుతూ వస్తున్నాయి… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 71,030 శాంపిల్స్ పరీక్షించగా.. 1,869 మంది పాజిటివ్‌గా తేలింది… మరో 18 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో.. 2,316 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,87,051కు చేరుకోగా.. రికవరీ కేసులు 19,55,052కు పెరిగాయి.. ఇక, ఇప్పటి వరకు…
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తగ్గినట్టే తగ్గి మరలా పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సెకండ్ వేవ్ సమయంలో భారీగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. రోజువారీ కేసులు మూడు లక్షలకు పైగా, మరణాలు మూడు వేలకు పైగా నమోదయ్యాయి. కాస్త తెరిపించడంతో అన్ని రంగాలను తిరిగి ప్రారంభించారు. పర్యాటక రంగం తిరిగి ప్రారంభం కావడంతో హిమాచల్ ప్రదేశ్ వంటి హిల్ స్టేషన్ రాష్ట్రాలకు టూరిస్టుల తాకిడి పెరిగింది. మాస్క్‌ను పక్కన పెట్టి తిరుగుతుండటంతో ఆ…
వ్యాక్సిన్‌తోపాటు ఖరీదైన గిఫ్ట్‌లూ ఫ్రీగా ఇస్తామంటూ వాషింగ్టన్‌లో అధికారులు ప్రకటించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఉన్న టీనేజర్లను వ్యాక్సిన్‌లు వేసుకునేలా ఎంకరేజ్ చేయడానికి అక్కడి అధికారులు తిప్పలు పడుతున్నారు. ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ను ఫ్రీగా ఇవ్వడంతోపాటు అదృష్టం కలిసొస్తే 25 వేల డాలర్ల స్కాలర్‌షిప్ లేదా ఐప్యాడ్ కూడా దక్కుతుందని… వాషింగ్టన్ డీసీ మేయర్ మురియల్ బౌజర్ ప్రకటించారు. వాషింగ్టన్ డీసీతోపాటు చుట్టుపక్కల ఉన్న టీనేజర్లకు తొలి డోసు తీసుకుంటే ఎయిర్‌పాడ్స్, గిఫ్ట్‌కార్డులు, స్కాలర్‌షిప్పులు ఫ్రీ…
ప్రపంచంలో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. తగ్గిందిలే అనుకుంటున్న సమయంలో తిరిగి కరోనా విజృంభిస్తుండటంతో అన్నిదేశాలు బెంబెలెత్తిపోతున్నాయి. సోమవారం రోజున యూఎస్‌లో ఏకంగా లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. వ్యాక్సిన్ వేగంగా అమలు చేస్తున్నప్పటికీ కేసులు పెరుగుతుండటం భయాందోళనలు కలిగిస్తోంది. అమెరికాలోని ఆర్కాన్సన్ రాష్ట్రంలో అత్యధిక కేసులు, ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతున్నది. సోమవారం రోజున ఆ రాష్ట్రంలో 1376 మంది ఆసుపత్రుల్లో చేరారు. ఇక అమెరికా తరువాత అత్యధిక కేసులు ఇరాన్‌లో నమోదవుతున్నాయి. సడలింపులు…
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 494 కరోనా కేసులు నమోదైనట్టు తెలంగాణ ఆరోగ్యశాఖ పేర్కొన్నది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,50,353కి చేరింది. ఇందులో 6,38,410 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా.. 8,112 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కరోనాతో ముగ్గురు మృతిచెందినట్టు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 3,831కి చేరింది. ఇక ఇదిలా…
మాస్క్ లేకుండా బయటకు వస్తే భారీ జరిమానాలు విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, మాస్క్ పెట్టుకున్నప్పటికీ ఓ వ్యక్తికి జరిమానా విధించడంతో పాటుగా జైల్లో పెట్టారు. అదేంటి మాస్క్ ధరిస్తే జరిమానా వేయడం ఏంటి అనుకుంటున్నారా… అక్కడే ఉంది ట్విస్ట్. మామూలు మాస్క్ ధరిస్తే ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ, ఆ వ్యక్తి భయపెట్టే విధంగా కాస్ట్యూమ్ మాస్క్ ధరించాడు. భయపెట్టే విధంగా ఉన్న మాస్క్ ధరించి దారినపోయే వారిని భయపెడుతుండటంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని…