భారత్‌లో కరోనా రోజువారి కేసులు కొన్నిసార్లు స్థిరంగా కొనసాగుతున్నా.. మరికొన్నిసార్లు హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య 30 వేల దిగువకు పడిపోయింది… ఇంత తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడం 147 రోజుల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా 15,11,313 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 28,204 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 373 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.. 41,511 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. దీంతో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3.19 కోట్లకు చేరగా.. 4.28 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక, యాక్టివ్ కేసుల సంఖ్య 4 లక్షల దిగువకు పడిపోయి.. యాక్టివ్ కేసుల రేటు 1.21 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 97.45 శాతానికి పెరిగిందని బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.