తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 494 కరోనా కేసులు నమోదైనట్టు తెలంగాణ ఆరోగ్యశాఖ పేర్కొన్నది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,50,353కి చేరింది. ఇందులో 6,38,410 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా.. 8,112 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కరోనాతో ముగ్గురు మృతిచెందినట్టు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 3,831కి చేరింది. ఇక ఇదిలా ఉంటే, గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 621 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
Read: మాస్క్ పెట్టుకున్నా… అతడిని అరెస్ట్ చేశారు… ఎందుకంటే…