తెలంగాణలో కరోనా పాజిటివ్ రోజువారి కేసుల తగ్గుతూ వస్తుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 87,355 సాంపిల్స్ పరీక్షించగా.. 420 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ముగ్గురు కోవిడ్ బాధితులు మృత్యువాతపడ్డారు.. ఇదే సమయంలో 623 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,52,135కు చేరగా.. రికవరీ కేసులు 6,40,688గా పెరిగాయి.. ఇక,…
దేశంలో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. డెల్టా వేరియంట్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. థర్డ్‌వేవ్ ముంచుకొస్తుందన్న వార్తలు వస్తున్న క్రమంలో… డెల్టా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వివిధ దేశాల్లో కేసులు పెరుగుదలకు డెల్టానే కారణమని WHO పదే పదే చెప్తోంది. ప్రపంచంలో 142 దేశాలు డెల్టా కోరల్లో చిక్కుకున్నాయని ప్రకటించింది. అంతేకాదు భారత్ డేంజర్ లిస్ట్‌లో ఉన్నట్టు తెలిపింది. గామా, బీటాతో పోలిస్తే డెల్టా వెయ్యి రెట్లు అధిక ప్రభావం చూపిస్తోందని హెచ్చరించింది. వారం…
దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నా ఉధృతి ఏ మాత్రం తగ్గడంలేదు. డెల్టా, డెల్టాప్లస్ వేరియంట్లు నమోదవుతున్నాయి. ముఖ్యంగా డెల్టా వేరియంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. మొదటి వేవ్‌లో 60 ఏళ్లు పైబడిన వారికి ఎక్కువగా కరోనా సోకగా, సెకండ్ వేవ్‌లో మధ్యవయస్కులు ఎక్కువగా కరోనా బారిన పడ్డారు. కాగా, గత కొన్ని రోజులుగా దేశంలోని వివిధ నగరాల్లో చిన్నారులకు కరోనా సోకుతుండటంతో థర్డ్ వేవ్ మొదలైందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే మిజోరాం రాష్ట్రం రాజధాని ఐజ్వాల్‌లో చిన్నారులు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో 5.76 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను కేంద్రం కేటాయించింది. ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి వ్యాక్సిన్లు చేరుకున్నాయి. వీటిని వైద్య అధికారులు గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వీటిని సరఫరా చేయనున్నారు. ఏపీకి అదనపు వ్యాక్సిన్ డోసులు అందడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. కాగా…రాష్ట్రంలో గత 24 గంటల్లో 71,030 శాంపిల్స్ పరీక్షించగా..…
దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరుగుతూ ఆందోళనకు గురిచేస్తున్నాయి.. ఇక, థర్డ్ వేవ్ ప్రారంభం అయ్యిందంటూ ఓవైపు.. థర్డ్ వేవ్ ముప్పు చిన్నారులకే ఎక్కువనే హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో.. బెంగళూరులో కరోనా విలయతాండవం చేస్తోంది. 11 రోజుల్లో 543 మంది పిల్లలకు కరోనా సోకింది. ఆగస్టు 1 నుంచి 11 మధ్యకాలంలో నగరంలో 543 మంది పిల్లలకు కరోనా సోకినట్లు బృహత్ బెంగళూరు మహానగర పాలికె వెల్లడించింది. వీరిలో 210 మంది పిల్లలు 0…
తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులు కాస్త పెరిగాయి.. 87,509 శాంపిల్స్ పరీక్షించగా… 427 మందికి పాజిటివ్‌గా తేలింది… మరో ఇద్దరు కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 609 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,51,715 కు చేరగా… కోలుకున్నవారి సంఖ్య 6,40,065 కి పెరిగింది.. ఇక,…
కరోనా సెకండ్ వేవ్ భారత్‌లో కాస్త తగ్గుముఖం పట్టింది.. కొన్ని దేశాలు మినహా ప్రపంచవ్యాప్తంగా కూడా కోవిడ్ కేసులు తగ్గుతూ వచ్చినట్టే వచ్చి.. మళ్లీ పంజా విసురుతున్నాయి… ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇప్పటికే థర్డ్ వేవ్ ప్రారంభం అయ్యిందనే హెచ్చరికలు ఓవైపు ఆందోళన కలిగిస్తుండగా.. ఇప్పుడు మళ్లీ పాజిటివ్ కేసులు పెరగడం.. మృతుల సంఖ్య కూడా క్రమంగా పైకి కదులుతుండడంతో మళ్లీ కలవరం మొదలైంది.. తాజా గణాకాంల ప్రకారం.. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7 లక్షల…
ఏపీలో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ వస్తోంది. తాజాగా ఏపీ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 73,341 సాంపిల్స్ పరీక్షించగా.. 1,746 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 20 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 1,648 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,90,656 కి పెరగగా.. కోలుకున్నవారి సంఖ్య 19,58,275 కి చేరింది..…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టాలంటే తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రపంచం మొత్తం ఘోషిస్తోంది. దానికి తగ్గట్టుగానే ఆర్ధిక స్తోమతను బట్టి వివిధ దేశాలు వ్యాక్సినేషన్‌ను అమలు చేస్తున్నాయి. అయితే, వ్యాక్సిన్‌ను విమర్శించేవారు, వ్యాక్సిన్‌పై నమ్మకం లేనివారు కూడా కోకొల్లుగా ఉన్నారు. అలాంటి వారిలో ఓ జర్మన్ నర్సు కూడా ఉన్నది. బ్రెజిల్ లోని ఉత్తర సముద్రతీరంలోని ప్రైస్‌ల్యాండ్ ప్రాంతంలోని ఓ టీకా కేంద్రంలో నర్సుగా పనిచేస్తున్న మహిళ… 8600 మందికి వ్యాక్సిన్ కు బదులుగా సెలైన్ ద్రావణాన్ని…
ఇండియాలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. తాజాగా ఇండియాలో 40,120 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,21,17,826కి చేరింది. ఇందులో 3,13,02,345 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,85,227 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 585 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు 4,30,254 మంది కరోనాతో మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ…