కరోనా మహమ్మారిపై పోరాటం చేసేందుకు టీకాలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున టీకాలు అందిస్తున్నారు. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో టీకాలు అందిస్తున్నారు. ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్, హెల్త్‌కేర్ వర్కర్లు, కరోనా వారియర్స్‌కు టీకాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే, ఇప్పటి వరకు అత్యవసర వినియోగం కింద అనుమతులు పొందిన కోవీషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు త్వరలో బహిరంగ మార్కెట్లోకి రాబోతున్నాయి. కోవీషీల్డ్, కోవాగ్జిన్ తయారీ సంస్థలు బహిరంగ…
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ఇది గుర్తించిన అన్ని దేశాలు వ్యాక్సిన్ల ఉత్పత్తి, వ్యాక్సినేషన్‌పై దృష్టిసారించాయి.. ఇక, భారత్‌లో దేశీయంగా తయారై.. అనుమతి పొందిన వ్యాక్సిన్లలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా ఒకటి… తాజాగా, మరో అరుదైన ఘనత సాధించింది కొవాగ్జిన్.. చిన్నారులు, వయోజనులకు పంపిణీ చేస్తున్న కొవాగ్జిన్ టీకా ‘యూనివర్సల్ వ్యాక్సిన్’గా గుర్తింపు పొందింది.. ఈ విషయాన్ని భారత్ బయోటెక్ వెల్లడించింది.. Read Also:…
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్ సాగుతోంది.. భారత్‌లోనూ ఈ ప్రక్రియ వేగంగా సాగుతోంది.. కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్ డోస్ వంద శాతం పూర్తిచేశారు.. సెకండ్ డోస్ వేస్తున్నారు.. ఇక, టీనేజర్లకు కూడా టీకా వేసేసేందుకు సిద్ధం అయ్యింది ప్రభుత్వం.. ఇవాళ్టి నుంచి దేశవ్యాప్తంగా 15 – 18 ఏళ్ల వయసు పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు…
కరోనా సమయంలో భారత్ అనేక దేశాలకు మానవతా దృక్పదంలో సహాయం చేసింది. అమెరికాతో సహా అనేక దేశాలకు మందులను సప్లై చేసింది. కోవిడ్ మొదటి దశలో ఇండియా నుంచి మలేరియా మెడిసిన్‌ను వివిధ దేశాలకు ఉచితంగా సప్లై చేసింది. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ను తయారు చేసిన తరువాత కూడా ఇండియా మిత్ర దేశాలకు మాత్రమే కాకుండా ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్‌ను మానతవతా దృక్పధంలో అందించింది. తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌కు 5 లక్షల కోవాగ్జిన్ డోసులను సరఫరా చేసింది.…
దేశంలో కరోనా తీవ్రత తగ్గలేదు. కోవిడ్ పాజిటివ్ కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. 15-18 ఏళ్ల లోపు వారికి కోవిడ్ వ్యాక్సినేషనుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.2022 జనవరి 3 తేదీ నుంచి 15-18 ఏళ్ల మధ్య ఉన్న వారికి కోవిడ్ వ్యాక్సిన్ వేయనుంది ప్రభుత్వం.కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఈ వయస్సున్న వారందరికీ ప్రస్తుతం కోవాక్సిన్ టీకాను మాత్రమే వేస్తున్నట్టు ప్రకటించింది వైద్యారోగ్యశాఖ. 2007 కంటే ముందు పుట్టిన వారంతా ఈ వ్యాక్సిన్ డోసుకు అర్హులని…
కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న చిన్నారులకు భారత్ బయోటెక్ శుభవార్త వినిపించింది. 12నుంచి18 సంవత్సరాల వయసున్న పిల్లలకు భారత్ బయోటెక్ తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో కరోనా మహమ్మారి నుంచి పిల్లల్ని రక్షించేందుకు మార్గం సుగమం కానుంది. దేశంలో 18 సంవత్సరాల లోపువారికి యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ల సరఫరా జరుగుతోంది. చిన్నారుల వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ఎప్పుడో పూర్తయ్యాయి. డీసీజీఐ అనుమతి వచ్చిన వెంటనే చిన్నారులకు వ్యాక్సిన్ కార్యక్రమం…
సౌతాఫ్రికాలో వెలుగు చేసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ క్రమంగా అన్ని దేశాలను చుట్టేస్తోంది.. తాజాగా కరోనా పుట్టినిల్లు చైనాను కూడా తాకింది ఈ కొత్త వేరియంట్.. మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు బూస్టర్ డోస్‌పై చర్చ మొదలైంది.. భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది.. ఇప్పటికే 133 కోట్ల మార్క్‌ను కూడా దాటేసింది వ్యాక్సినేషన్.. దేశీయంగా తయారైన కోవాగ్జిన్, కోవిషీల్డ్‌దే దీనిలో అగ్రభాగం.. మరి, ఇప్పుడు బూస్టర్ డోస్‌పై చర్చ సాగుతోన్న తరుణంలో.. కోవాగ్జిన్ బెటరా..? కోవిషీల్డ్…
దేశంలో ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ ను అపాలంటే బూస్టర్ డోస్ కచ్చితం అనటం హాస్యాస్పదం అన్నారు డాక్టర్ యు.రఘురాం. అత్యధిక బూస్టర్ డోస్ వేసుకున్న ఇజ్రాయెల్ లో ఫోర్త్ వేవ్ నడుస్తూ భారీ కేసులు నమోదవుతున్నాయన్నారు. టెక్నికల్ గా కోవిషీల్డ్ లో అప్డేటెడ్ బూస్టర్ రాదన్నారు. వేసుకున్నా ఆ బూస్టర్ డోస్ పని చేస్తుందని నమ్మకం లేదన్నారు. కోవాక్సిన్ లో సాధారణ ఫ్లూ వ్యాక్సిన్స్ లు, ఎప్పటికప్పుడు అప్డేటెడ్ బూస్టర్ తీసుకోవచ్చు…
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రం కాకుండా అడ్డుకోగలిగారు, లక్షలాది మంది ప్రాణాలు కాపాడగలిగారు అంటే దానికి కారణం వ్యాక్సినేషన్. కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయాలి అంటే లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం కాదని, నిబంధనలు పాటిస్తూనే కరోనాకు వ్యాక్సిన్ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఫార్మా కంపెనీలు, శాస్త్రవేత్తలు నిరంతరాయంగా పనిచేసి వ్యాక్సిన్‌ను తీసుకొచ్చారు. Read: మళ్లీ పెరిగిన బంగారం… ఇండియా సొంతంగా తయారు చేసుకున్న వ్యాక్సిన్ కోవాగ్జిన్. ఈ వ్యాక్సిన్ తయారిపై ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్…
కోవాగ్జిన్ టీకాపై భారత్ బయోటెక్ కీలక ప్రకటన చేసింది. కోవిడ్ తీవ్ర లక్షణాలు సోకకుండా కోవాక్సిన్ 93.4 శాతం కాపాడుతుందని.. ప్రకటించింది భారత్ బయోటెక్. కోవాక్సిన్ 3వ దశ క్లినికల్ ట్రయిల్ డేటాను లాన్‌సెట్ ప్రచురించిందని… క్లినికల్ ట్రాయల్స్ లో పాల్గొన్న వారిలో 0.5% కంటే తక్కువ మందిలో తీవ్ర దుష్పరిణామాలు ఉన్నాయని తెలిపింది. డెల్టా వేరియంట్ సోకకుండా 65.2 శాతం కాపాడగలదని పేర్కొంది భారత్ బయోటెక్. అన్ని రకాల కోవిడ్ స్ట్రైన్స్ నుంచి 70.8 శాతం…