దేశంలో కరోనా మహమ్మారి తీవ్రం కాకుండా అడ్డుకోగలిగారు, లక్షలాది మంది ప్రాణాలు కాపాడగలిగారు అంటే దానికి కారణం వ్యాక్సినేషన్. కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయాలి అంటే లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం కాదని, నిబంధనలు పాటిస్తూనే కరోనాకు వ్యాక్సిన్ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఫార్మా కంపెనీలు, శాస్త్రవేత్తలు నిరంతరాయంగా పనిచేసి వ్యాక్సిన్‌ను తీసుకొచ్చారు.
Read: మళ్లీ పెరిగిన బంగారం…
ఇండియా సొంతంగా తయారు చేసుకున్న వ్యాక్సిన్ కోవాగ్జిన్. ఈ వ్యాక్సిన్ తయారిపై ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ గోయింగ్ వైరల్ మేకింగ్ ఆఫ్ కోవాగ్జిన్ ఇన్‌సైడ్ స్టోరీ అనే పుస్తకాన్ని రాశారు. ఇందులో శాస్త్రవేత్తల కృషితో పాటుగా, లక్షలాది మంది ప్రాణాలు కాపాడటంలో కీలక పాత్రను పోషించిన కోతుల గురించి కూడా ప్రస్తావించారు.
Read: కేబీఆర్ పార్క్ లో సినీ నటిపై దాడి
ఏ వ్యాక్సిన్ అయినా ఫార్ములా కనిపెట్టిన తరువాత వాటిని మొదట చిన్న జంతువుల్లో ప్రయోగిస్తారు. అక్కడ విజయవంతమైతే కోతులపై ప్రయోగించాలి. మనిషి శరీర నిర్మాణానికి కోతుల శరీర నిర్మాణం దగ్గరగా ఉంటుంది. అందులోనూ వ్యాక్సిన్ ప్రయోగానికి రీసస్ జాతికి చెందిన కోతులను ప్రత్యేకంగా వినియోగిస్తారు. ఈ రీసస్ జాతికి చెందిన కోతుల్లో వ్యాధినిరోధక శక్తి అధికంగా ఉంటుంది. ఈ కోతులను చైనా నుంచి అనేక దేశాలు దిగుమతి చేసుకుంటాయి. కాని, కరోనా కారణంగా దిగుమతులు నిలిచిపోవడంతో ఇండియాలో రీసస్ కోతుల కోసం శాస్త్రవేత్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Read: గంగవ్వ కొత్త ఇల్లు చూసి ఫిదా!
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆ జాతి కోతుల కోసం గాలించారు. లాక్ డౌన్ అమలులో ఉండటంతో కోతులకు ఆహారం దొరక్క అడవిలోకి వెళ్లిపోయాయి. దీంతో మహారాష్ట్రలోని అడవుల్లో ఈ జాతి కోతులు ఉన్నాయని తెలుసుకున్న ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు, మహారాష్ట్రలోని అడవుల్లో అటవీశాఖ సహాయంతో గాలించారు. చివరకు నాగపూర్ సమీపంలో ఆ కోతులు దొరికాయి. మనుషుల నుంచి కోతులకు సార్స్ కోవ్ 2 వైరస్ సోకకుండా రక్షించి వాటిపై కోవాగ్జిన్‌ను ప్రయోగించినట్టు బలరాం భార్గవ తాను రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. కోవాగ్జిన్‌ను కనిపెట్టిన శాస్త్రవేత్తలతో పాటు కోతులు కూడా రియల్ హీరోలే అని బలరాం భార్గవ పేర్కొన్నారు.