కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ ఉత్పత్తిని క్రమంగా తగ్గిస్తున్నట్లు భారత్ బయోటెక్ కంపెనీ శుక్రవారం వెల్లడించింది. టీకా ఒప్పంద కంపెనీలకు సరఫరా పూర్తి కావడం, టీకాకు డిమాండ్ తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది. మరోవైపు వైరస్ వ్యాప్తి తగ్గడం, దాదాపు అందరూ వ్యాక్సిన్ తీసుకోవడంతో కరోనా టీకాలకు డిమాండ్ తగ్గినట్లు అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో టీకా తయారీ కేంద్రాల నిర్వహణ పనులు చేపడతామని.. ఈ సదుపాయాలను మరింత సమర్థంగా వినియోగించే ప్రక్రియలపై దృష్టి…
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్ వి వంటి వ్యాక్సిన్‌లు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే సీరం ఇనిస్టిట్యూట్ ఇఫ్ ఇండియా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ టీకా డోసుల మధ్య వ్యవధి తగ్గించాలని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (NTAGI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధి 12 నుంచి 16 వారాలుగా ఉంది. అయితే ఈ వ్యవధిని 8 నుంచి 16 వారాలకు…
18 ఏళ్లలోపు చిన్నారుల కోసం తయారైన కొవాగ్జిన్ ప్రయోగాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం సమాచార విశ్లేషణ కొనసాగుతోంది. వీటికి సంబంధించిన సమాచారాన్ని డీసీజీఐకి వచ్చే వారం అందించనున్నారు. దాదాపు వెయ్యి మంది వాలంటీర్లపై ఈ ప్రయోగాలు నిర్వహించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న కొవాగ్జిన్ టీకా ఉత్పత్తిని గణనీయంగా పెంచినట్లు సంస్థ అధికారులు తెలిపారు. మరో వైపు ముక్కు ద్వారా తీసుకునే వ్యాక్సిన్ రెండో దశ ప్రయోగాలు వచ్చే నెల నాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయని భారత్ బయోటెక్ అధికారులు వెల్లడించారు.…
కోవాగ్జిన్ వ్యాక్సిన్ పనితీరుపై ప్రపంచ ఆరోగ్యసంస్థ సంతృప్తి వ్యక్తం చేసింది.త్వరలోనే ఎమర్జెన్సీ వినియోగానికి సంబంధించి అనుమతులు మంజూరు చేయనుంది. మరోవైపు.. భారత్ తన జనాబాలో 60 నుంచి 70శాతానికి వ్యాక్సీన్ వేయడం అత్యవసరమని who స్పష్టం చేసింది. హైదరాబాద్ బేస్డ్ వ్యాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్‌కు .. ప్రపంచ ఆరోగ్యసంస్థ శుభవార్త అందించింది. ఇప్పటికీ WHO అనుమతుల కోసం వేచి చూస్తున్న కోవాగ్జిన్‌కు.. త్వరలోనే అత్యవసర వినియోగానికి సంబంధించి, అనుమతులు మంజూరు చేయనుంది. read also :…
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్‌కు కితాబు ఇచ్చింది అమెరికా… కరోనాతో పాటు తాజాగా.. భారత్‌లో వెలుగుచూసిన ఆల్ఫా, డెల్టా వేరియంట్లపై కూడా కోవాగ్జిన్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తున్నట్లు తేలింది. కోవాగ్జిన్‌పై టీకాలపై అధ్యయనం నిర్వహించిన అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్… ఎస్‌ఏఆర్‌ఎస్-సీవోవీ-2 ఆల్ఫా, డెల్టా వేరియంట్లను కోవాగ్జిన్ చాలా ప్రభావవంతంగా ఎదుర్కొంటుందని తేల్చింది.. ఈ వ్యాక్సిన్ తీసుకున్న కొందరి నమూనాలను సేకరించి అధ్యయనం చేసిన ఎన్‌ఐహెచ్.. ఆల్ఫా…
కరోనా కట్టడికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ప్రస్తుతం ఇతర దేశాల వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వస్తుండగా.. ముందుగా.. భారత్‌లోనే రెండు వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చింది సర్కార్.. ఇప్పటికే కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు విస్తృతంగా వేస్తున్నారు.. ఇక, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ మూడో దశ ప్రయోగాలకు సంబంధించిన డేటాను సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ (ఎస్‌ఈసీ) ఆమోదించింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకి కంపెనీ సమర్పించిన డేటా ప్రకారం మూడోదశలో కోవాగ్జిన్ 77.8 శాతం…
కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని చెబుతున్నారు వైద్య నిపుణులు.. దీంతో.. అంతా వ్యాక్సినేషన్‌పై పడిపోయారు.. కేంద్రం నుంచి వచ్చే వ్యాక్సిన్లతో పాటు.. రాష్ట్రాలు కూడా గ్లోబల్ టెండర్ల ద్వారా వ్యాక్సిన్లు కొనుగోలుచేస్తున్న సంగతి తెలిసిందే… ఇక, ఏపీ ప్రభుత్వం వ్యాక్సిన్ కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చింది.. 11,45, 540 కోవిషీల్డ్ డోసులకు గాను రూ.36,08,45,100 చెల్లించింది.. కోవిషీల్డ్ ఒక డోస్ ధర రూ 300 కాగా.. దానికి 5 శాతం ట్యాక్స్ కలుపుకుని రూ.315గా అవుతుంది.. ఇక,…
రాష్ట్రాలకు ఉపశమనం కలిగిస్తూ నిన్న సీరం.. తన వ్యాక్సిన్ కోవిషీల్డ్ ధరలు తగ్గించగా.. ఇప్పుడు.. భారత్ బయోటెక్ సంస్థ కూడా గుడ్ న్యూస్ చెప్పింది.. రాష్ర్టాలకు అందించే కొవాగ్జిన్ ధరలను తగ్గించింది.. కొవాగ్జిన్ ఒక్క డోసును రూ. 400కే సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. కాగా, గతంలో ఒక్క డోసును రూ. 600గా నిర్ధారించిన భారత్ బయోటెక్.. ఇప్పుడు ఏకంగా ఒక్క డోసుపై రూ. 200కు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, కోవిషీల్డ్ టీకా ధరను సీరం…