కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని చెబుతున్నారు వైద్య నిపుణులు.. దీంతో.. అంతా వ్యాక్సినేషన్‌పై పడిపోయారు.. కేంద్రం నుంచి వచ్చే వ్యాక్సిన్లతో పాటు.. రాష్ట్రాలు కూడా గ్లోబల్ టెండర్ల ద్వారా వ్యాక్సిన్లు కొనుగోలుచేస్తున్న సంగతి తెలిసిందే… ఇక, ఏపీ ప్రభుత్వం వ్యాక్సిన్ కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చింది.. 11,45, 540 కోవిషీల్డ్ డోసులకు గాను రూ.36,08,45,100 చెల్లించింది.. కోవిషీల్డ్ ఒక డోస్ ధర రూ 300 కాగా.. దానికి 5 శాతం ట్యాక్స్ కలుపుకుని రూ.315గా అవుతుంది.. ఇక, 3,45,680 కోవాక్సిన్ డోసులకు గాను రూ.14,30,85,600 చెల్లించింది.. కోవాక్సిన్ ఒక డోసు ధర రూ. 400 కాగా.. దాని 5 శాతం ట్యాక్స్ అదనంతో రూ.415 అవుతుంది.. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.. 45 సంవత్సరాల పై బడిన వారికి జూన్ నెల వరకు రెండు డోసులు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.