Jyoti Malhotra: పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేశారనే ఆరోపణలతో సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు ఈరోజు (జూన్ 9న) తొలిసారి కోర్టులో విచారణకు రాబోతుంది. ఆమెను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరు చేయడం జరుగుతుంది. అయితే, గత విచారణలో, హిసార్ కోర్టు జ్యోతి మల్హోత్రాను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చింది. అప్పటి నుంచి ఆమె హిసార్ సెంట్రల్ జైలులోనే ఉన్నారు. కాగా, పాక్ కి గుఢచార్యం చేసిన కేసులో మల్హోత్రాకు జ్యుడీషియల్ కస్టడీని మరింత పొడిగిస్తారా లేదా ఆమెకు బెయిల్ లభిస్తుందా అనేది న్యాయస్థానం ఈరోజు నిర్ణయించనుంది.
Read Also: CM Revanth Reddy : అఖిల్ రిసెప్షన్ కు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
అయితే, భద్రతా సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం.. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ హైకమిషన్‌లో అహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్‌ను కలిశానని అంగీకరించింది. దీని తర్వాత, ఆమె రెండుసార్లు పాక్ కు కూడా వెళ్లి, అక్కడ అలీ హసన్‌తో భేటీ అయినట్లు చెప్పిందన్నారు. అలీ హసన్ ఆమెను పాకిస్తాన్ నిఘా సంస్థల అధికారులను పరిచయం చేశాడని జాతీయ దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. మరోవైపు, పాకిస్తాన్ మాజీ సబ్-ఇన్స్పెక్టర్ నాసిర్ థిల్లాన్ సోషల్ మీడియాలో ఒక వీడియోను రిలీజ్ చేశారు. గూఢచర్యం ఆరోపణలపై అరెస్టైన పంజాబ్‌కు చెందిన జస్బీర్, జ్యోతి మల్హోత్రాలను తీవ్రంగా ఖండించారు. ఇద్దరూ నిర్దోషులని భారత్ అక్రమంగా అరెస్ట్ చేసిందని పేర్కొన్నారు.