Priyadarshi : ప్రియదర్శి హీరోగా వరుస సక్సెస్ లు అందుకుంటున్నాడు. తన ప్రతి సినిమాలో కంటెంట్ ఉండేలా చూసుకుంటున్నాడు. ఒక్కో అడుగు జాగ్రత్తగా వేస్తూ హీరోగా తనకంటూ గ్యారెంటీ హిట్ అనే బ్రాండ్ క్రియేట్ చేసుకుంటున్నాడు. హీరోగా చిన్న సినిమాలతో కెరీర్ మొదలు పెట్టినా.. వరుస సక్సెస్ లు అందుకోవడంతో ఆయన మార్కెట్ పెరుగుతుంది. ఇప్పటికే బలగం సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. దాని తర్వాత కోర్టు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు సారంగపాణి జాతకం మూవీతో మరో హిట్ ఖాతాలో పడిపోయింది. హీరోగా ఆయన చేస్తున్న సినిమాలు అన్నీ ఏదో ఒక రకమైన ఎఫెక్ట్ ను ప్రేక్షకుల్లో చూపిస్తున్నాయి. ఈ నడుమ ప్రియదర్శిని చూస్తుంటే ఆయన కమెడియన్ గా సినిమాలను బాగా తగ్గించేశాడు.
Read Also : Towhid Hridoy: బంగ్లాదేశ్ ఆటగాడిపై నిషేధం!
హీరోగా సక్సెస్ అవుతున్నాడు కాబట్టి కమెడియన్ గా చేస్తే బాగోదని ఫిక్స్ అయ్యాడు. అంతే కదా మరి.. ఎవరైనా సరే హీరోగా ఎదగాలని ఆశపడుతారు. అంతేగానీ కమెడియన్ స్థాయిలో ఆగిపోవాలని ఎన్నడూ కోరుకోరు. ఇప్పుడు ప్రియదర్శి కూడా ఇదే బాటలో వెళ్తున్నాడు. హీరోగా ఆయనకు అవకాశాలు, మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరుగుతున్నాయి. ప్రియదర్శి సినిమా చేశాడు అంటే కచ్చితంగా ఏదో ఒక విషయం ఉండే ఉంటుంది అనే ముద్ర పడుతోంది. అందుకే ప్రియదర్శి సినిమాలకు మంచి మార్కెట్ ఏర్పడుతోంది. ప్రేక్షకులు కూడా ప్రియదర్శి సినిమా అంటే థియేటర్లకు వచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ లెక్కన ఇంకో రెండు హిట్లు పడితే మాత్రం ప్రియదర్శి పూర్తిగా హీరోగానే సెటిల్ అయిపోవడం ఖాయం.