మన దేశంలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 48,786 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,04,11,634 కి చేరింది. ఇందులో 2,94,88,918 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 5,23,257 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 1,005 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 3,99,459 మంది కరోనాతో మృతి చెందారు. ఒక్క రోజులో దేశంలో 61,588 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో ఇప్పటి వరకు 33,57,16,019 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.