ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా కిందికి దిగివస్తోంది… రాష్ట్రంలో గత 24 గంటల్లో 93,759 సాంపిల్స్ ని పరీక్షిచంగా.. 3,464 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. మరో 35 మంది కోవిడ్ బాధితులు కన్నుమూశారు.. చిత్తూరులో ఐదుగురు, ప్రకాశంలో ఐదుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, గుంటూరులో నలుగురు, కృష్ణలో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, అనంతపూర్‌లో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు, కడపలో ఒక్క రు, కర్నూల్‌లో ఒక్కరు, పశ్చి…
కొన్నిసార్లు జరిగే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా పెద్ద తిప్పలు వస్తుంటాయి. బతికున్నా సరే బతికున్నామనే సర్టిఫికెట్ కావాలని అడిగే ఈరోజుల్లో, బతికున్న వ్యక్తికి డైరెక్ట్‌గా ఫోన్‌చేసి మీ డెత్ సర్టిఫికెట్ రెడీ అయింది వచ్చి తీసుకెళ్లండి అని అడిగే రోజులు వచ్చాయి అంటే అర్ధం చేసుకోవచ్చు. అది పొరపాటు కావోచ్చు మరేదైనా కావోచ్చు. ఇలాంటి పరిస్థితి థానేలోని మాన్ పడాలో టీచర్ పనిచేస్తున్న చంద్రశేఖర్ కొన్ని రోజుల క్రితం కరోనా సోకింది. ట్రీట్‌మెంట్ తీసుకొని కోలుకున్నారు.…
డెల్టా వేరియంట్ వందకు పైగా దేశాల్లో వ్యాపించింది. మిగతా వేరియంట్ల కంటే ఈ డెల్టా వేరియంట్ తీవ్రత అధికంగా ఉన్నట్టు ఇప్పటికే నిర్ధారణ జరిగింది. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు ఈ వేరియంట్‌పై ఎంత వరకు ప్రభావం చూపుతున్నాయి. ఎంత వరకు మహమ్మారిని కంట్రోల్ చేస్తుంది అనే దానిపై స్పష్టత రావాల్సి ఉన్నది. అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్ని వ్యాక్సిన్లు రెండు డోసుల వ్యాక్సిన్లు కాగా, జాన్సన్ అండ్…
ఏదైనా సరే ఒక్కడితోనే మొదలౌతుంది. అతని మార్గాన్ని వేలాది మంది ఫాలో అవుతుంటారు. కరోనా మహమ్మారి కారణంగా కోట్లాది మంది ఉద్యోగ, ఉపాది అవకాశాలు కోల్పోయారు. ఉద్యోగాలు చేసిన సమయంలో సంపాదించిన మొత్తంతోనే రెండేళ్లుగా ప్రజలు నెట్టుకొస్తున్నారు. ఇప్పుడిప్పుడే కరోనాకేసులు తగ్గతుండటంతో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే, పూర్తిస్థాయిలో రవాణా వ్యవస్థ తెరుచుకోలేదు. కేవలం కొన్ని మాత్రమే నడుస్తున్నాయి. ముఖ్యంగా ముంబై వంటి మహానగరాల్లో సామాన్యులు ప్రయాణం చేసే మెట్రో రైళ్లు తెరుచుకున్నా, ప్రభుత్వ ఉద్యోగులకు, అత్యవసరంగా…
మన దేశంలో కరోనా కేసులు పెరుగుతూ తగ్గుతున్నాయి. నిన్న పెరిగిన కరోనా కేసులు.. ఇవాళ కాస్త తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 46,617 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,04,58,251 కి చేరింది. ఇందులో 2,95,48,302 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 5,09,637 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24…
తూర్పుగోదావరి జిల్లాలోని ఆలయాల్లోకి దర్శనాలకు నేటి నుంచి భక్తులకు అనుమతి ఇస్తున్నారు. దాదాపు రెండు నెలల తర్వాత ఇవాళ ఉదయం నుంచి భక్తుల దర్శనాలు ప్రారంభమయ్యాయి. అన్నవరంలో నేటి నుంచి భక్తులకు సత్యదేవుని వ్రతములు, కల్యాణములు, తలనీలాల సమర్పణకు అవకాశం కల్పించారు. అయినవల్లి , అంతర్వేది, అప్పనపల్లి, కోనసీమ తిరుమల వాడపల్లి ఆలయాలకు భక్తుల రాక తిరిగి ప్రారంభమైంది. అయితే మధ్యాహ్నం ఒంటి గంట వరకూ మాత్రమే భక్తులకు అనుమతి ఇస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేసారు.
కరోనా ప్రభావం అన్నిరంగాలపై పడింది. కరోనాకు ముందు కళకళలాడిన హోటల్ రంగం కోవిడ్ ఎంటర్ కావడంతో కుదేలయింది. నిత్యం రద్దీగా ఉండే బెంగళూరు వంటి నగరాల్లో కూడా హోటల్ రంగం కుదేలయింది. బెంగళూరు నగరంలో 25 వేలకు పైగా హోటళ్లు ఉండగా 2500 హోటళ్లు అమ్మకానికి ఉన్నట్టు హోటల్ అసోసియోషన్ తెలియజేసింది. కర్ణాటక రాష్ట్రంలో దాదాపుగా 70 వేలకు పైగా రిజిస్ట్రేషన్ హోటళ్లు ఉండగా, అందులో 10వేలకు పైగా హోటళ్లు అమ్మకానికి సిద్దంగా ఉన్నట్టు సమాచారం. కరోనా…
ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ప్రతి ఒక్కరికి వారి జీవితంపై ఎన్నో కలలు ఉంటాయి. ఆ కలను నెరవేర్చుకోవడానికి అహర్నిశలు కష్టపడుతుంటారు. అయితే, కరోనా మహమ్మారి ఆ కలలపై నీళ్లు చల్లింది. కష్టపడి సాధించుకున్న ఉద్యోగాలు పోయి కోట్లాదిమందిని రోడ్డున పడేసింది ఈ మహమ్మారి. కొంతమంది జీవితంలో ఏదేతే సాధించాలని అనుకున్నారో, అది సాధించి ఆ ఫలాలు చేతికి అందే సమయానికి కరోనా మహమ్మారికి బలైపోతున్నారు. బీహార్‌కు చెందిన అవినాశ్ అనే వ్యక్తికి చిన్నప్పటి…
మన దేశంలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 48,786 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,04,11,634 కి చేరింది. ఇందులో 2,94,88,918 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 5,23,257 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 1,005 మంది మృతి చెందారు.…