భారత్‌లో కరోనా రోజువారి కేసుల సంఖ్య మరోసారి స్పల్పంగా తగ్గింది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 8,306 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. మరో 211 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. ఇదే సమయంలో.. 8,834 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,46,41,561కు చేరగా.. రికవరీ కేసుల సంఖ్య 3,40,69,608కి చేరింది.. ఇక,…
కరోనా ఫస్ట్, రెండో వేవ్ దేశాన్ని ఎంతగా వణికించిందో అందరూ మర్చిపోయారు. మాస్క్‌లు ధరించకుండా బయట తిరుగుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం దేశంలో కేవలం 2శాతం మంది మాత్రమే మాస్కులు ధరిస్తున్నారని ‘లోకల్ సర్కిల్స్’ అనే సామాజిక సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇంటి నుంచి బయటకు వెళ్తున్న ప్రతి ముగ్గురులో ఒకరు మాస్కు ధరించటం లేదనిఈ సర్వే తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌తో పోల్చితే మాస్క్ పెట్టుకునేవారి సంఖ్య సెప్టెంబర్‌లో 29శాతం పడిపోయిందని తెలిపింది.…
తెలంగాణలో నిన్న మొన్నటివరకూ కరోనా నియంత్రణలో వుంది. అయితే విదేశాలనుంచి విరుచుకుపడుతున్న ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే వైద్యారోగ్యశాఖ అప్రమత్తం అయింది. విదేశాలనుంచి వచ్చేవారి విషయంలో నియంత్రణ చేపట్టింది. అయితే, తెలంగాణలో కరోనా నియంత్రణకు ఎలాంటి పటిష్ట చర్యలు చేపట్టకపోవడం, కరోనా నియంత్రణకు మాస్క్ ధరించక పోవడంపై లోకాయుక్త సీరియస్ అయ్యారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ పెట్టకకపోవడం, స్మోకింగ్ పై సుమోటోగా కేసు స్వీకరించారు. నిబంధనలు కఠినంగా అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు లోకాయుక్త. గుంపులుగా…
ఏపీలో ఇవాళ మళ్లీ కరోనా కేసులు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. ఇక ఇవాళ ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 30,979 శాంపిల్స్ పరీక్షించగా.. 154 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో నలుగురు కోవిడ్ బాధితులు మృతి చెందారు. ఇక, ఇదే సమయంలో 177 మంది కోవిడ్ నుంచి పూర్తి స్థాయి లో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల…
తెలంగాణలో కరోనా రోజువారి కేసులు నేడు భారీగా పెరిగాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 39,495 శాంపిల్స్ పరీక్షించగా… 213 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో ఒక్క కరోనా బాధితుడు మృతిచెందారు. ఇదే సమయంలో 156 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,76,787కు చేరుకోగా… రికవరీ కేసులు 6,69,010కు పెరిగాయి.. ఇక,…
ఆంధ్రప్రదేశ్‌లో రోజువారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 32,036 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 186 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది… మరో ముగ్గురు కోవిడ్ బాధితులు మృతిచెందరు. ఇదే సమయంలో 191 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. ఇక, ఇవాళ్టి టెస్ట్‌లతో కలుపుకొని రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,05,39,041 కు చేరింది.. మొత్తం…
కరోనా మహమ్మారి ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతోంది.. ఇప్పటికే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ భారత్‌తో పాటు చాలా దేశాలను ఇబ్బందులకు గురిచేసింది.. ఫస్ట్ వేవ్‌ను కాస్త లైట్ తీసుకోవడంతో సెకండ్ వేవ్ విరుచుకుపడింది.. భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో పాటు.. మరణాల సంఖ్య కూడా అమాంతం పెరిగిపోయింది. ఇక, థర్డ్ వేవ్ ముప్పు ఉందంటూ ఎప్పటి నుంచి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అయితే, ఒమిక్రాన్ రూపంలో థర్డ్ వేవ్ మొదలైందా?…
తెలంగాణలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు మంత్రి తలసానితో భేటీ అయ్యారు సినీ ప్రముఖులు. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో ఎస్ ఎస్ రాజమౌళి, దిల్ రాజు, డివివి దానయ్య, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు మరికొందరు సినీ ప్రముఖులు సమావేశం నిర్వహిస్తున్నారు. సినిమారంగ సమస్యలు, టిక్కెట్ ధరల పెంపు, కరోనా మూడో దశ నేపథ్యంలో మళ్లీ థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య తగ్గింపుపై జరుగుతున్న ప్రచారంపై చర్చించనున్నారు. అంతేకాకుండా సినిమా షూటింగ్‌లు ఎలా…
కరోనా మహమ్మారి టెన్షన్ నుంచి ప్రపంచదేశాలు ఇప్పట్లో బయటపడేలా కనిపించడంలేదు పరిస్థితి.. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. జెట్ స్పీడ్‌తో ప్రపంచదేశాలను చుట్టేస్తోంది.. గత నెల 24వ తేదీన ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బయటపడగా… కేవలం తొమ్మిది రోజుల్లోనే 30 దేశాలకు వ్యాప్తి చెందింది.. అందులో భారత్ కూడా ఉండడం మరింత కలవరపెట్టే విషయం.. ఇక, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 375 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. సౌతాఫ్రికాలో అత్యధికంగా 183 కేసులు…