తెలంగాణలో థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా వున్నామన్నారు వైద్యారోగ్య, ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు. 21 లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్లు సిద్దం చేయాలని ఆదేశించారు. ప్రపంచ వ్యాప్త కరోనా పరిస్థితుల పరిశీలనకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. 545 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సౌకర్యం సిద్దం చేయాలన్నారు. ప్రజలు మాస్కులు ధరించాలి, రెండు డోసుల వాక్సిన్ తీసుకోవాలని హరీష్ రావు సూచించారు. కరోనా తాజా పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు.…
ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. ఇక ఇవాళ ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 29, 228 శాంపిల్స్ పరీక్షించగా.. 132 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ఒక్క కోవిడ్ బాధితుడు మృతి చెందారు. ఇక, ఇదే సమయంలో 186 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,08,27,634 కు…
భారత్‌లో కరోనా కొత్త కేసులు తగ్గుతున్నాయి… ఈ రోజు వారి కేసుల సంఖ్య ఐదు వేల చేరువగా వెళ్లింది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,784 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 252 మంది కోవిడ్ బాధితులు మృతిచెంచారు.. ఇదే పమయంలో 7,995 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు తన బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ.. ప్రస్తుతం దేశ్యాప్తంగా…
ప్రపంచ ఆరోగ్యసంస్థ మరో హెచ్చరిక చేసింది. కరోనాకు ముందు సమయంలో ప్రజలు ట్రీట్మెంట్ కోసం సొంత డబ్బులు ఖర్చు చేశారు. దీంతో దాదాపు దాదాపు 50 కోట్ల కంటే ఎక్కువ మంది తీవ్ర పేదరికంలో నెట్టివేయబడ్డారని ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది. ప్రజలు వైద్యసేవలు పొందే విషయంలో కోవిడ్ ప్రభావం చూపుతోందని, ఫలితంగా ఇతర ఆరోగ్యసమస్యల కోసం ప్రజలు పెద్దమొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోందని డబ్ల్యూహెచ్ఓ తెలియజేసింది. Read: మాదాపూర్ ఎన్‌కన్వెన్షన్ వద్ద ఉద్రిక్తత… అల్లు అర్జున్…
ప్రపంచం మొత్తంమీద ప్రస్తుతం కరోనాతో అత్యంత ఇబ్బందులు పడుతున్న దేశం ఏంటని అంటే బ్రిటన్ అని టక్కున చెప్పేస్తున్నారు. సౌతాఫ్రికాలో మొదలైన ఒమిక్రాన్ వేరియంట్‌లు ఇప్పుడు అత్యధికంగా బ్రిటన్‌లోనే కనిపిస్తున్నాయి. రోజుకు వందల సంఖ్యలో ఈ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆ దేశం అప్రమత్తం అయింది. గతంలో విధించిన లాక్‌డౌన్ ల దెబ్బకు ఆర్థికంగా కుదేలైంది. ప్రజలను మహమ్మారుల నుంచి బయటపడేసేందుకు ప్రస్తుతం ఆంక్షలు అమలు చేస్తున్నది. Read: యూరప్‌ను వణికిస్తున్న ఒమిక్రాన్… ఫ్రాన్స్‌లో…
ఇండియా కరోనా కేసులు మళ్లీ క్రమంగా తగ్గుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 7,350 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 202 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,97,860 కు చేరుకుంది. అలాగే మరణాల సంఖ్య 4,75,636 కు చేరుకుంది. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 91,456 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది…
ప్రపంచాన్ని ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతున్నది. సౌతాఫ్రికాలో మొదలైన ఈ వేరియంట్ వేగంగా అన్ని దేశాలకు వ్యాపిస్తోంది. వ్యాక్సిన్ ఎంత మేరకు ఒమిక్రాన్ వేరియంట్‌ను అడ్డుకోగలుగుతుంది అనే దానిపై ప్రస్తుతం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్‌ను పూర్తిగా అడ్డుకోలేవని, ప్రపంచ ఆరోగ్యసంస్థ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. Read: పెట్రోల్ బంకుల్లో ఈ సేవలు పూర్తిగా ఉచితం… అవేంటో తెలుసా… వ్యాక్సిన్ తీసుకోవడం కొంత మంచిదే అని, వేరియంట్ తీవ్రత, మరణం నుంచి కాపాడగలడం సరైందే అని డబ్ల్యూహెచ్ఓ…
ఆంధ్రప్రదేశ్‌లో రోజువారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఈరోజు స్థిరంగా ఉంది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 30,859 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 160 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది… ఒక్క కోవిడ్ బాధితుడు మృతిచెందరు. ఇదే సమయంలో 201 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. ఇక, ఇవాళ్టి టెస్ట్‌లతో కలుపుకొని రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,07,77,396 కు చేరింది.. మొత్తం…
దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అందోళన చెందుతున్నారు. ఈరోజు దేశంలో మొత్తం మూడు కొత్త కేసులు నమోదయ్యాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోనూ, రెండో కేసు ఛండీగడ్‌లోనూ నమోదుకాగా, మూడో కేసు కర్ణాటకలో బయటపడింది. ఇప్పటికే కర్ణాటకలో రెండు కేసులు నమోదయ్యాయి. ఈరోజు నమోదైన మరో కేసుతో కలిపి మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. Read: ఆమెకు భారీ టిప్పు ఇచ్చి ఆశ్చర్యపరిచిన కస్టమర్……
తెలంగాణలో కరోనా రోజువారి కేసులు కొంచెం పెరిగాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 35,978 శాంపిల్స్ పరీక్షించగా… 188 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో ఒక్క కరోనా బాధితుడు మృతిచెందారు. ఇదే సమయంలో 193 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,78,142 కు చేరుకోగా… రికవరీ కేసులు 6,70,246 కు పెరిగాయి..…