భారత్‌లో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నిన్న 87 కేసులు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 101 కి చేరింది. దేశంలో మొత్తం 11 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. మహారాష్ట్రలో అత్యధికంగా 32 కేసులు ఉండగా, ఢిల్లీలో ఈ సంఖ్య 22 కి చేరింది. రాజస్థాన్‌లో 17, కర్ణాటక, తెలంగాణలో 8 కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కట్టడికి అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని, అందరూ తప్పకుండా కోవిడ్ నిబంధనలు పాటించాలని…
రెండో ప్రపంచ యుద్ధం తరువాతి రోజుల్లో ప్రపంచంలోని సంహభాగం దేశాలు భారీగా అప్పులు చేశాయి. అగ్రదేశాలు సైతం పెద్ద మొత్తంలో అప్పులు చేశాయి. ఆ తరువాత క్రమంగా ఆర్ధికంగా దేశాలు కోలుకోవడంతో అప్పుల భారం తగ్గించుకుంటు వచ్చాయి. ఇన్నేళ్ల తరువాత మళ్లీ కరోనా విజృంభణ సమయంలో ప్రపంచ దేశాలు భారీ స్థాయిలో అప్పులు చేసినట్టు ఐఎంఎఫ్ ప్రకటించింది. Read: విమానం ఎక్కే అవకాశం లేక…సొంతంగా విమానం తయారు చేశాడు… ఐఎంఎఫ్ నివేదికల ప్రకారం 2020లో ప్రపంచ దేశాలు…
గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. కరోనా సార్స్‌కోవ్ 2 వైరస్ మొదట చైనాలోని పూహన్‌లో కనిపించింది. అక్కడి నుంచి ప్రపంచం మొత్తం వ్యాపించింది. వూహాన్‌లోని వైరాలజీ ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయ్యి ఉంటుందని చాలా కాలంగా అమెరికా అనుమానం వ్యక్తం చేస్తూ వస్తున్నది. అయితే, చైనా అలాంటిది ఏమీ లేదని, జంతువుల నుంచి మనుషులకు వ్యాపించిందని, అక్కడి నుంచి ఇతరులకు వ్యాపించిందని చెప్తూ వచ్చింది. అయితే, కెనడాకు చెందిన నిపుణులు సైతం…
ప్రపంచాన్ని గజగజలాడించిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుందని సంతోషపడేలోపు ఒమిక్రాన్ మళ్లీ ప్రజల మీదకు విరుచుకుపడుతోంది. ఇక ఈ వేరియంట్ భయంతో ఉన్న ప్రజలకు పలువురు ప్రముఖులు కరోనా బారిన పడడం భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఇటీవల స్టార్ హీరో కమల్ హాసన్ కోవిడ్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా మరో స్టార్ హీరో విక్రమ్ కరోనా బారిన పడ్డారు. గత రెండు రోజులుగా హై ఫీవర్ తో భాదపడుతున్న విక్రమ్ కోవిడ్ పరీక్షలు…
కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మరలా పెరుగుతున్నది. కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా కేసులు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూరోపియన్ దేశాల్లో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. దీనికి కారణాలు లేకపోలేదు. కరోనా నుంచి రక్షణ పొందాలంటే తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకుంటే ఒమిక్రాన్ నుంచి కొంతమేర రక్షణ పొందవచ్చు. ఆసుపత్రుల్లో చేరే అవకాశం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నా చాలా మంది నిర్లక్ష్యం వహించి వ్యాక్సిన్ తీసుకోవడం లేదు.…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజు పెరుగుతూ.. తాగుతూ వస్తున్నాయి. అయితే ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 35,071 శాంపిల్స్ పరీక్షించగా.. 163 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఒక్క కోవిడ్ బాధితుడు మృతిచెందారు.. ఇదే సమయంలో 162 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,08,62,705 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. మొత్తం పాజిటివ్…
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తెలంగాణలో అడుగు పెట్టేసింది.. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలిపోయింది.. మరో వ్యక్తికి ఒమిక్రాన్‌పై క్లారిటీ రావాల్సి ఉంది.. అయితే, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు.. ఒమిక్రాన్ కేసులో హైదరాబాద్‌లో వెలుగుచూసిన సందర్భంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఒమిక్రాన్ రిస్క్ ఉన్న దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులతో పాటు.. విదేశాల నుంచి…
క్రమంగా ప్రపంచాన్ని చుట్టేసే పనిలో పడిపోయింది కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ఇప్పటికే భారత్‌లో పలు రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగు చూడగా.. ఇప్పుడు తెలంగాణను కూడా తాకింది. నిన్నటి వరకు భారత్‌లో 37 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఏపీలోనూ ఒక కేసు వెలుగుచూసింది.. ఇప్పుడు తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.. అయితే, మరో వ్యక్తికి సంబంధించిన పూర్తి రిపోర్ట్ రావాల్సి ఉందని చెబుతున్నారు.. కెన్యా,…
ఇండియా కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 6,984 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 247 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 34,710,628 కు చేరుకుంది. అలాగే మరణాల సంఖ్య 4,76,135 కు చేరుకుంది. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 87,562 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది…