గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. తగ్గినట్టే తగ్గి మరలా విరుచుకుపడుతున్నది. కరోనాకు భయపడి చాలా దేశాలు సరిహద్దులను మూసివేశాయి. విమాన సర్వీసులు నిలిపివేశాయి. జాతీయంగా షరతులతో కూడిన విమానాలను కొంతకాలం పాటు నడిపారు. రష్యాతో పాటుగా కొన్ని దేశాల్లో కరోనా ఇంకా విజృంభిస్తూనే ఉన్నది. మొన్నటి వరకు ఆస్ట్రేలియాలోని కొన్ని దేశాల్లో కరోనా మహమ్మారి ఇబ్బంది పెట్టింది. 18 నెలలుగా అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసిన ఆస్ట్రేలియా ప్రస్తుతం తిరిగి పునరుద్దరించింది. రెండు డోసుల…
కేరళ రాష్ట్రాన్ని మరోసారి కరోనా వైరస్ భయపెడుతోంది. కేరళలో ఒక్క ఆదివారం రోజే 7,167 కరోనా కేసులు వెలుగు చూశాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 49,68,657కి చేరింది. మరోవైపు కొత్తగా 167 మంది కరోనాతో మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 31,681కి చేరుకుంది. కేరళలో తాజాగా నమోదైన కరోనా కేసులు చూస్తుంటే త్వరలో థర్డ్ వేవ్ ముప్పు ఉందని స్పష్టమవుతోంది. దేశంలో ప్రస్తుతం అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రం ఒక్క…
కరోనాకు పుట్టినిల్లు చైనా. చైనాలోని ఊహాన్ నగరంలో తొలి కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత కరోనా ప్రపంచవ్యాప్తమైంది. కోట్లాది మంది కరోనా బారిన పడ్డారు. లక్షలాది మంది మృతి చెందారు. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. రెండేళ్లుగా ప్రపంచాన్ని ఈ సమస్య పట్టిపీడిస్తూనే ఉన్నది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చినా కేసులు కంట్రోల్‌కావడం లేదు. కరోనా కొత్తగా రూపాంతరం చెందుతూ ఎటాక్ చేస్తున్నది. తిరిగి తిరిగి మళ్లీ అక్కడికే వచ్చినట్టుగా కరోనా కేసులు…
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం స్థంభించిపోయింది. ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందులు కలిగించిన కరోనా, మెదడుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు 3.2 కోట్ల మందికి సంబంధించిన ఆరోగ్య విషయాలపై పరిశోధనలు చేశారు. కరోనా సోకిన 28 రోజుల తరువాత లేదా అస్త్రాజెనకా వ్యాక్సిన్ తీసుకున్న 28 రోజుల తరువాత నాడీ సంబంధమైన సమస్యలు ఉన్నాయా? ఉంటే ఎలా ఉన్నాయి అనే అంశంపై పరిశోధనలు నిర్వహించారు. తొలిడోసు వ్యాక్సిన్…
కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో కొన్నిరోజులుగా అక్కడ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన యంత్రాంగం పలు చర్యలు చేపట్టింది. చైనా వ్యాప్తంగా సోమవారం 29 కరోనా కేసులు నిర్ధారణ కాగా.. అందులో ఆరు కేసులు చైనా వాయువ్య ప్రావిన్సు గాన్సు రాజధాని లాన్‌జౌలో నమోదయ్యాయి. దీంతో 40 లక్షల జనాభా గల లాన్‌జౌ నగరంలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు అత్యవసరం అని భావిస్తే మాత్రమే ఇళ్ల…
కరోనా మహమ్మారి రూపం మార్చుకుంటూ యావత్ ప్రపంచ మానవాళి గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తోంది. ధనిక, పేద దేశాలు అని తేడా లేకుండా అందరిమీద దాడి చేస్తూనే ఉంది.. జన్యుపరమైన మార్పులు చోటు చేసుకుంటూ ప్రజలను భయపెడుతోంది. ఇప్పుడు డెల్టా వేరియెంట్‌లోని ఏవై.4.2 రకం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తాజాగా కొత్త వేరియంట్ లక్షణాలు కనిపించినట్టు డాక్టర్లు ప్రకటించారు. యూకేలో కొత్త వేరియంట్ కేసులు ఆగడం లేదు. ఇటు, అమెరికా, రష్యా, ఇజ్రాయెల్‌లో కూడా వెలుగు…
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలో ఎందరో జీవితాలు కకావికలం అయ్యాయి. కరోనా కారణంగా కొంతమంది ప్రాణాలు కోల్పోతే.. మరికొందరు ఉపాధి కోల్పోయారు. అంతేకాకుండా కరోనా మనిషి సగటు ఆయువులో కూడా కోత పెట్టేసింది. సాధారణంగా గతంలో ఓ మనిషి ఆరోగ్యంగా ఉంటే వందేళ్లు జీవించేవాడు. కానీ మారుతున్న కాలం, ఆహారపు అలవాట్ల కారణంగా మనిషి సగటు ఆయువు తగ్గిపోయింది. అది చాలదన్నట్లుగా ఇప్పుడు కరోనా మహమ్మారి వచ్చి ఇంకా ఆయువులో కోత పెట్టిందని పరిశోధకులు చెప్తున్నారు. ఇటీవల…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు. పలు చోట్ల ఇంకా డబుల్ డిజిట్‌లోనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 191 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో 162 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా నమోదైన కేసులతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,69,556కి చేరింది. కరోనా నుంచి 6,61,646 మంది కోలుకోగా మొత్తం 3,942…
ఒలింపిక్స్ సమయంలో కరోనా మహమ్మారి జపాన్ దేశాన్ని వణికించేసింది. కొత్త కేసులతో వణికిపోయింది. ఎలాగోలా కరోనా సమయంలోనే ఒలింపిక్స్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఒలింపిక్స్ ముగిసిన కొద్ది నెలల వ్యవధిలోనే కరోనా మహమ్మారిపై జపాన్ అతిపెద్ద విజయం సాధించింది. కరోనాను కట్టడి చేయడంతో విజయవంతం అయింది. అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా వంటి దేశాల్లో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. అటు మరణాల సంఖ్య కూడా పెద్ద ఎత్తున పెరుగుతున్నది. అయితే, జపాన్‌లో అందుకు భిన్నంగా కేసులు కంట్రోల్ కావడం…
కరోనా కేసులు ప్రపంచాన్ని మళ్లీ భయపెడుతున్నాయి. అనేక దేశాల్లో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి. దీంతో కరోనా నుంచి బయటపడేందేకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనాకు మొదటి వ్యాక్సిన్‌ను తయారు చేసిన రష్యా మరోసారి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రజలు అందోళనల చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా నిత్యం 900 మందికి పైగా కరోనాతో…