ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్నటి బులిటెన్ ప్రకారం 20 వేలకు దిగువున కేసులు నమోదవ్వగా ఈరోజు బులిటెన్ ప్రకారం కేసులు మళ్లీ పెరిగాయి. తాజాగా, దేశంలో 22,431 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,38,94,312కి చేరింది. ఇందులో 3,32,00,258 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 2,44,198 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 318 మంది మృతి చెందారు.…
భారత్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇప్పటి వరకు అనుమతులు రాలేదు. అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చే అంశంపై వచ్చే వారం ప్రపంచ ఆరోగ్యసంస్థ తుది నిర్ణయం తీసుకోనున్నది. దీనిపై ప్రపంచ ఆరోగ్యసంస్థ నిపుపులు వచ్చేవారం సమావేశం కాబోతున్నారు. టీకాకు సంబంధించిన పూర్తి డేటాను ఇప్పటికే భారత్ బయోటెక్ సంస్థ అందజేసింది. దీనితో పాటుగా సెప్టెంబర్ 27 వ తేదీన అదనపు డేడాను కూడా భారత్ బయోటెక్ ప్రపంచ ఆరోగ్యకు అందజేసింది. దేశంలో ఇప్పటికే కోవాగ్జిన్…
కరోనా బారిన పడి మృతి చెందిన కుటుంబాలకు ఇచ్చే పరిహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కరోనాతో మరణించినట్లు దృవీకరణ పత్రం లేకున్నాకూడా పరిహారం అందించాలని, ఈ పరిహారం కోసం ధరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా పరిహారం అందించాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. జాతీయ విపత్తున నిర్వహణ సంస్థ ప్రతిపాదించిన విధంగా రూ.50 వేల పరిహారాన్ని ఇవ్వకుండా ఏ రాష్ట్రం నిరాకరించరాదని,…
కరోనా కాలంలో టెస్టులు చేయించుకోవడం సహజంగా మారింది. ప్రపంచంలో అనేక దేశాలు ప్రజలకు ఉచితంగా కరోనా టెస్టులు నిర్వహిస్తున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రం తప్పని సరిగా టెస్టులకు ప్రభుత్వం నిర్ధేశించిన డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, అమెరికా లాంటి దేశాల్లో కరోనా పరీక్షల ధరలపై నియంత్రణ ఉండదు. దీంతో ఆసుపత్రులు సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఛార్జ్ చేస్తుంటాయి. అయితే, డల్లాస్ కు చెందిన ట్రెవిస్ వార్నర్ అనే వ్యక్తి కరోనా టెస్టులు చేయించుకున్నారు. పీసీఆర్ టెస్టులు…
1918 అనగానే మనకు మొదటి ప్రపంచ యుద్ధం, స్పానిష్ ఫ్లూ గుర్తుకు వస్తాయి. ఆ సమయంలో జన్మించిన ఇప్పటి వరకు జీవిస్తున్న వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అమెరికాకు చెందిన ప్రీమెట్టా రెండు రకాల మహమ్మారులను చూసింది. స్పానిష్ ఫ్లూ విస్తరిస్తున్న సమయంలో ఆమె రెండేళ్ల చిన్నారి. ఆ ఫ్లూను సమర్థవంతంగా ఎదుర్కొని బయటపడింది. రెండో ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో జన్మించిన ప్రీమెట్టా రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గోన్న వ్యక్తిని వివాహం చేసుకున్నది. సామాజిక సేవకురాలిని…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా దేశంలో 18,870 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు భారత్‌లో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,37,16,451కి చేరింది. ఇందులో 3,29,86,180 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,82,520 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, భారత్‌లో కరోనాతో గడిచిన 24 గంటల్లో 378 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,47,751 మంది మృతి చెందినట్టు…
కరోనా ఇప్పటి వరకు పూర్తిగా తొలగిపోలేదు. నిత్యం కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. భారత్‌తో సహా చాలా దేశాల్లో ఇంకా కొనసాగుతూనే ఉన్నది. నిబంధనలు పాటిస్తూనే ఉన్నారు. అయితే, ప్రపంచ దేశాల్లో పెద్ద ఎత్తున కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండటంతో మరణాల రేటు, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తగ్గుముఖం పడుతున్నది. వ్యాక్సిన్ తీసుకోవడం, రోగనిరోధక శక్తిని పెంచుకోవడం వంటి అంశాల కారణంగా కరోనాను అదుపులో ఉంచవచ్చు. అయితే, కరోనా పూర్తిగా ఎప్పటి వరకు అంతం అవుతంది…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఈరోజు మళ్ళీ పెరిగింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 45,592 శాంపిల్స్ పరీక్షించగా.. 771 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజా టెస్ట్‌లతో కలుపుకుని.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 2,81,78,305 కు చేరింది. ఇక, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,48,230 కి పెరగగా.. ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 20,22,168 కు చేరుకుంది..…
ప్రపంచంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. కరోనా వైరస్ అనేక విధాలైన వేరియంట్‌లుగా రూపాంతరం చెందుతున్నాయి. ఇందులో ఆల్ఫా, గామా, బీటా, కప్పా వేరియంట్‌లు ప్రస్తుతం పెద్దగా ప్రభావం చూపడం లేదు. ప్రపంచం మొత్తాన్ని ఇప్పుడు డెల్టా వేరియంట్ వణికిస్తోంది. ప్రపంచంలో నమోదవుతున్న కేసుల్లో 90 శాతం డెల్టా వేరియంట్ కేసులు ఉండటం విశేషం. కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు టీకాలు తీసుకుంటున్నా, ఈ వేరియంట్ కేసులు టీకాలు తీసుకోని వారికి, తీసుకున్న వారికి సోకుతున్నది. 185…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా దేశంలో 26,964 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 383 మంది మృతి చెందారు. దేశంతో మొత్తం ఇప్పటి వరకు 3,27,83,741 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో కరోనాతో ఇప్పటి వరకు 4,45,768 మంది మృతి చెందారు. దేశంలో 3,01,989 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్త కేసుల కంటే రికవరీ కేసులు పెరుగుతుండటంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కరోనా మహమ్మారి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని,…