కేరళలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రతిరోజూ 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. కేసులు పెరుగుతుండటంతో వ్యాక్సిన్‌ను వేగవంతం చేశారు. వేగంగా వ్యాక్సిన్ అందిస్తున్నప్పటికీ కేసులు పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, 84 ఏళ్ల వృద్ధురాలికి అరగంట వ్యవధిలో కోవీషీల్డ్ రెండు డోసులు ఇవ్వడంతో సంచలనంగా మారింది. ఎర్నాకులం జిల్లాలోని అలువా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ ఘటన జరిగింది. 84 ఏళ్ల తుండమ్మ అనే మహిళ తన…
రెండేళ్ల క్రితం 2019 డిసెంబర్‌లో చైనాలోని వూహాన్ నగరంలో మొదటి కరోనా కేసు నమోదైంది. ఆ తరువాత అక్కడి నుంచి ఈ వైరస్ ప్రపంచం మొత్తం వ్యాపించింది. వైరస్ వ్యాప్తి తరువాత ఇప్పుడు మరోసారి చైనాలో కేసులు వెలుగుచూస్తున్నాయి. చైనాని దక్షిణ ప్రావిన్స్‌లో కేసులు నమోదవుతున్నాయి. దీంతో దక్షిణ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో తిరిగి లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. డెల్టావేరియంట్ కేసులు పెరుగుతుండటంతో నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. పుతియాన్ నగరంలో కేసులు పెరుగుతున్నాయి.…
ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. సెంకండ్ వేవ్ ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గత కొన్ని రోజులుగా కేసులు తగ్గుముఖం పట్టినా మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా దేశంలో 30,570 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కొత్తగా నమోదైన కేసుల సంఖ్య 3,33,47,325కి చేరింది. ఇందులో 3,25,60,474 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,42,923 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనా నుంచి 38,303 మంది కోలుకున్నట్టు…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ ఒక్కటే ప్రస్తుతానికి ఉన్న ఏకైక మార్గం కావడంతో దేశంలో ప్రతిరోజూ లక్షల సంఖ్యలో వ్యాక్సిన్ అందిస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్నది. ఇక తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ డ్రైవ్‌లు ఏర్పాటు చేసి వ్యాక్సిన్లు అందిస్తున్నారు. మొబైల్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల్లో ఈ మొబైల్ కేంద్రాల ద్వారా వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 2 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించారు. రాబోయే 15 రోజుల…
కరోనా కేసులు ప్రపంచంలో పెరిగిపోతూనే ఉన్నాయి. కరోనా కారణంగా పిల్లలు ఇంటికే పరిమితం అవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో స్కూళ్లు తెరిచినప్పటికి కరోనా భయంతో పిల్లలను ఇంటినుంచే చదివించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. కరోనా సమయంలో ఇంటిపట్టునే ఉండటంతో పిల్లలు అధిక బరువు పెరుగుతున్నట్టు అమెరికన్ మెడికల్ అసోసియోషన్ జర్నల్ సర్వేలో తేలింది. 5-11 ఏళ్ల వయసున్న పిల్లలు కరోనా కాలంలో బరువు పెరిగినట్టు ఈ సర్వే పేర్కొన్నది. కోవిడ్ కాలంలో 5-11 ఏళ్ల లోపున్న పిల్లలు 2.5…
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్థికంగా నిలదొక్కుకున్న దేశాలు సైతం కరోనా దెబ్బకు కుదేలయ్యాయి. కరోనా ఎలా వస్తుంది. దాని వలన వచ్చే ఇబ్బందులు ఎంటి? కరోనా అంటే ఎంటి… ఎలా ఒకరి నుంచి మరోకరికి సోకుతుంది… క్వారంటైన్, చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర విషయాలను విద్యార్థులకు బోధించేందుకు పశ్చిమ బెంగాల్ సిద్దమైంది. 11 వ తరగతిలోని హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్‌లో పాఠ్యాంశంగా బోధించనునన్నారు. 11 వ తరగతికి…
శ్రీలంకలో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. కరనా మహమ్మారి కేసుల కారణంగా ఆదేశంలో చాలా కాలంపాటు లాక్‌డౌన్ ను విధించారు. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై పెనుభారం పడింది. అంతేకాదు, విదేశీమారక ద్రవ్య నిల్వలు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. దీని నుంచి బయటపడేందుకు కీలకమైన దిగుమతులను నిలిపివేసింది. ఇక దేశంలో ఫుడ్ ఎమర్జెన్సీని ప్రకటించింది. దేశంలో వ్యాపారులు నిత్యవసర వస్తువులను అక్రమంగా స్టాక్ పెట్టుకోకూడదు. ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే నిత్యవసర సరుకులు విక్రయించాలి. అక్రమంగా…
దేశంలో ఒకవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా అమలు జరుగుతున్నా కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. పైగా కేసులు భారీ స్థాయిలో పెరుగుతుండటంతో కొన్ని రాష్ట్రాల్లో మరలా ఆంక్షలు మొదలయ్యాయి. నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వాలు హెచ్చిరిస్తున్నాయి. కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అస్సాం రాష్ట్రంలో కూడా నైట్ కర్ఫ్యూను విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 8 గంటల వరకు…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని భయపెడుతున్నది. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నా కేసులు పెరుగుతుండటంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఎలా మహమ్మారిని కట్టడి చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఇప్పుడు మరో వేరియంట్ ప్రపంచాన్ని భయపెడుతున్నది. సి 1.2 వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్నట్టు దక్షిణాఫ్రికా జాతీయ అంటువ్యాదుల సంస్థ పేర్కొన్నది. ఈ సీ 1.2 ను మొదటగా మే నెలలో దక్షిణాఫ్రికాలో గుర్తించారు. సి 1…