కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. అటువంటి కేరళ ఇప్పుడు వరస విపత్తులతో అతలాకుతం అవుతున్నది. దేశంలో తొలి కరోనా కేసులు కేరళ రాష్ట్రంలోనే కనిపించాయి. ఫస్ట్ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న కేరళ రెండో వేవ్‌లో చాలా ఇబ్బందులు పడింది. ఇప్పటికి కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కేరళలో ఇప్పటికీ పాజిటివిటి రేటు 10 శాతం వరకు ఉన్నది. కరోనాతో పాటు వరదలు, మరోవైపు బర్డ్‌ఫ్లూ కేసులు ఆ రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడుతున్నాయి. Read: డెంగీతో బీజేపీ…
రేపటి నుంచి పాకిస్థాన్‌తో టీ20 సిరీస్ ఆడనున్న వెస్టిండీస్ జట్టుకు భారీ షాక్ తగిలింది. మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన వెస్టిండీస్ జట్టులో ముగ్గురు ఆటగాళ్లతో పాటు సిబ్బందిలో ఒకరికి కరోనా సోకింది. రోస్టన్ ఛేజ్, షెల్డన్ కాట్రెల్, కైల్ మేయర్స్‌తో పాటు మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ నలుగురిని ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉంచినట్లు విండీస్ బోర్డు ప్రకటించింది. అయితే షెడ్యూల్ ప్రకారమే టీ20 సిరీస్…
తెలంగాణలో కరోనా రోజువారి కేసులు కొంచెం పెరిగాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 35,978 శాంపిల్స్ పరీక్షించగా… 188 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో ఒక్క కరోనా బాధితుడు మృతిచెందారు. ఇదే సమయంలో 193 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,78,142 కు చేరుకోగా… రికవరీ కేసులు 6,70,246 కు పెరిగాయి..…
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (IITH) బృందం కోవిడ్ ట్రాకర్ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఐఐటీహెచ్ ప్రొఫెసర్ ఎం విద్యాసాగర్ మాట్లాడుతూ.. 2022 జనవరి 27వ తేదీన ఒమిక్రాన్ కేసులు ఇండియాలో గరిష్టస్థాయికి చేరుకుంటాయని కోవిడ్ ట్రాకర్ ఫలితాల మేరకు ఆయన వెల్లడించారు. జనవరిలో దేశవ్యాప్తంగా 1.5 లక్షల ఒమిక్రాన్ కేసుల నమోదయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే ఇప్పటికే కోవిడ్ టీకాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పంపిణి…
తెలంగాణ కరోనా కేసులు ఈరోజు కొంచెం పెరిగాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 36,883 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 189 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. మరో ఇద్దరు కోవిడ్ బారినపడి మృతిచెందాడు.. ఇదే సమయంలో.. 137 కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,76,376 కి చేరగా.. రికవరీ…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇంకా భయపెడుతూనే ఉన్నది. తగ్గినట్టే తగ్గి తిరిగి వివిధ వేరియంట్ల రూపంలో విస్తరిస్తోంది. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బయటపడటంతో ప్రపంచ ఆరోగ్యసంస్థ అన్ని దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే 20కి పైగా దేశాల్లో ఈ వేరియంట్ ఉన్నట్టుగా ప్రపంచ ఆరోగ్యసంస్థ దృవీకరించింది. అయితే, కరోనా మహమ్మారి యూరప్ దేశాలను అతలాకుతలం చేస్తున్నది. Read: మహారాష్ట్రలో కొత్త రూల్స్: ఆ దేశాల నుంచి వచ్చే వారికి… రోజువారి కేసులు భారీ…
ప్రపంచానికి ఒమిక్రాన్ భయం పట్టుకుంది. ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ మరింత ప్రమాదకరం కావడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి. అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఎంత వరకు పనిచేస్తాయనే దానిపై ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నారు. దక్షిణాఫ్రికాలో నవంబర్ 14 వ తేదీన అ వేరియంట్ బయటపడింది. ఆ తరువాత క్రమంగా ప్రపంచ దేశాలకు విస్తరించడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ప్రపంచంలోని 14 దేశాలకు ఈ వేరియంట్ వ్యాపించినట్టు అధికారికంగా గుర్తించారు. అత్యధిక…
ప్రపంచానికి మళ్లీ కరోనా భయం పట్టుకుంది. మొన్నటి వరకు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్న దేశాలు ఇప్పుడు కొత్త వేరియంట్ రాకతో భయందోళనలు నెలకొన్నాయి. 32 మ్యూటేషన్లతో భయపెడుతున్న మహమ్మారి బి.1.1.529 కొత్త వేరియంట్‌కు ఒమిక్రాన్ అని నామకరణం చేసింది. కరోనా 19, దాని నుంచి ఏర్పడిన వేరియంట్లకు గ్రీక్ అక్షరమాల నుంచి పేర్లు పెట్టాలి. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా ఇలా అన్నిటికీ గ్రీక్ అక్షరమాల నుంచి తీసుకొని పేర్లు పెట్టారు. Read: నేపాలీ…
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న వారికి కూడా ఈ వేరియంట్ సోకుతోందని వార్తలు వస్తున్నాయి. కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఈరోజు ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. కొత్త వేరియంట్‌పై అప్రమత్తంగా ఉండాలని ఈ సమావేశంలో ప్రధాని మోదీ సూచించారు. భారత్‌పై ఈ వేరియంట్ ప్రభావం ఎలా ఉంటుందనే విషయంపై అధికారులతో మోదీ చర్చించారు. Read…