దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త కరోనా వేరియంట్ భారత స్టాక్ మార్కెట్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో శుక్రవారం నాడు మార్కెట్ సూచీలు రికార్డు స్థాయిలో పేకమేడలా కుప్పకూలాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,688 పాయింట్లు పతనమై 57,107 వద్ద ముగియడంతో పెట్టుబడిదారుల సంపద రూ.7.45లక్షల కోట్లు ఆవిరైపోయింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ ఏకంగా 510 పాయింట్లు కోల్పోయి 17,026 వద్ద స్థిరపడింది. దక్షిణాఫ్రికా వేరియంట్ భయాలతో ఒక్క భారత సూచీలే కాదు.. దాదాపు ఆసియా సూచీలన్నీ…
దేశవ్యాప్తంగా పేద ప్రజల సంఖ్య భారీగా పెరిగింది. గత రెండేళ్లుగా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భారత్‌లో పేదరికంలో మగ్గుతున్న వారి సంఖ్య పెరిగినట్లు నీతిఆయోగ్ వెల్లడించింది. రాష్ట్రాల వారీగా పేదరికం సూచీని నీతి ఆయోగ్ విడుదల చేసింది. నిరుపేదలు ఎక్కువ ఉన్న రాష్ట్రాల జాబితాలో బీహార్ అగ్రస్థానంలో ఉంది. బీహార్‌లో 51.91 శాతం మంది పేదలు ఉన్నారని మల్టీ డైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ (ఎంపీఐ) ద్వారా నీతి ఆయోగ్ తెలిపింది. ఆ తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్…
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనా పాజిటివ్ బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో శివశంకర్ మాస్టర్ ఆరోగ్యంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా స్పందించారు. శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ ఆస్పత్రి వైద్యులతో తాను మాట్లాడినట్లు తెలిపాడు. ఆయన రెండో కుమారుడు అజయ్‌తో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పానని పేర్కొన్నాడు. Read Also: గ్రీన్ ఇండియా…
ఏపీ గవర్నర్ కరోనా నుంచి కోలుకున్నారు. రేపు మధ్యాహ్నం ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకొని అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు చేరుకుంటారని గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. ఢిల్లీ పర్యటన తరువాత కరోనా లక్షణాలు బయటపడటంతో హైదరాబాద్ ఏఐజీ లో చికిత్స తీసుకున్నారు. ఆరోగ్యం మెరుగుపడతంతో ఆయన రేపు మధ్యాహ్నం రాజ్ భవన్‌కు చేరుకోనున్నారు. హైదరాబాద్‌లో చికిత్సపొందుతున్న సమయంలో ఆయన్ను తెలంగాణ గవర్నర్ పరామర్శించిన సంగతి తెలిసిందే. ఇక ఏపీ…
కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో మరోసారి ప్రమాదకర వైరస్‌లు వెలుగుచూశాయి. కరోనా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకిందని వస్తున్న వార్తల నేపథ్యంలో కొంతమంది శాస్త్రవేత్తలు చైనాలోని జంతువుల మాంసం విక్రయించే మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని పరీక్షలు జరిపారు. ఈ పరిశోధనల్లో ఆస్ట్రేలియా, చైనా, అమెరికా, బెల్జియం శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. 16 రకాల జాతులకు చెందిన 1725 వన్యప్రాణులపై వారు పరిశోధనలు జరిపారు. అయితే ఈ పరీక్షల్లో వారికి షాకింగ్ విషయాలు తెలిశాయి. ఒకటి కాదు.. రెండు…
కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్‌కు అరుదైన గౌరవం దక్కింది. కరోనా లాక్‌డౌన్ సమయంలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ తన నియోజకవర్గంలో ప్రజలకు ఎంతో సేవ చేశారు. కరోనా బాధితులను పరామర్శించడం, వారికి అండగా నిలవడం, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి మాస్కులు, శానిటైజర్లు అందజేయడం లాంటి పనులను చేపట్టారు. ఈ మేరకు ఆయన చేసిన కరోనా సేవలను గుర్తిస్తూ లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ఎమ్మెల్యే ఆర్థర్‌ను ‘సర్టిఫికెట్ ఆఫ్ కమిట్‌మెంట్’కు…
కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి అంటే తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ ఒక్కటే ప్రస్తుతానికి కొంత ఉపమనం కలిగిస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రపంచంలో కరోనా మరణాల సంఖ్య తగ్గిపోయింది. కరోనా వైరస్ సోకినా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే బయటపడుతున్నారు. అయితే, చాలా ప్రాంతాల్లో వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వీరి కోసం ఆకర్షణీయమైన బహుమతులను అందిస్తూ వ్యాక్సిన్ అందిస్తున్నారు. అటు ఆస్ట్రేలియా ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించి వ్యాక్సిన్…
ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టించిన అల్లకల్లోలం అంతాఇంతా కాదు. చైనాలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచంలోని అన్ని దేశాల్లో వ్యాప్తి చెంది ఎంతో మంది జీవితాలను అతలాకుతలం చేసింది. కరోనా కట్టడికి దేశాలు కోవిడ్ టీకాలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. కొన్ని దేశాల్లో కోవిడ్ టీకాలు మెరుగైన ఫలితాలను అందిస్తున్నాయి. అయితే యూరప్‌లో మరోసారి కరోనా విజృంభిస్తోంది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌వో) యూరప్‌కు హెచ్చరికలు జారీ చేసింది. యూరప్‌లో పెరుగుతున్న కరోనా కేసులను కట్టడి…
కరోనా వైరస్ కి పుట్టినిల్లయిన చైనాలో మళ్ళీ ఆ మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. మిగతా దేశాల్లో ఆంక్షలు సడలించి అన్నిటికీ పర్మిషన్లు ఇస్తున్నాయి. కానీ, చైనాలో మాత్రం మళ్ళీ వైరస్ కట్టడికి చర్యలు చేపడుతున్నారు. చైనా రాజధాని బీజింగ్‌లో దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళినవారు తిరిగి వస్తే ఖచ్చితంగా కరోనా టెస్టులు చేయించుకోవాలంటున్నారు. వీలైతే ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని వైద్య అధికారులు ఆదేశించారు. కొవిడ్ కేసులను సున్నా స్థాయికి పరిమితం చేసేందుకు ఈ మేరకు చర్యలు…
ఏడాదిన్నర కాలంగా కరోనా వైరస్ కాటుతో ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. చైనాలో పుట్టి ప్రపంచమంతా వ్యాప్తి చెందిన కరోనా వైరస్ వల్ల ఇప్పటివరకు 50 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ మరణాల సంఖ్య నవంబర్ 1వ తేదీ నాటికి 50.01 లక్షలకు చేరింది. కరోనా వైరస్ ధాటికి ముఖ్యంగా అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్, బ్రెజిల్ దేశాల ప్రజలు అల్లాడిపోయారు. ప్రపంచంలోని…