కరోనాకు పుట్టినిల్లు చైనా. చైనాలోని ఊహాన్ నగరంలో తొలి కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత కరోనా ప్రపంచవ్యాప్తమైంది. కోట్లాది మంది కరోనా బారిన పడ్డారు. లక్షలాది మంది మృతి చెందారు. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. రెండేళ్లుగా ప్రపంచాన్ని ఈ సమస్య పట్టిపీడిస్తూనే ఉన్నది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చినా కేసులు కంట్రోల్‌కావడం లేదు. కరోనా కొత్తగా రూపాంతరం చెందుతూ ఎటాక్ చేస్తున్నది. తిరిగి తిరిగి మళ్లీ అక్కడికే వచ్చినట్టుగా కరోనా కేసులు చైనాలో మళ్లీ పెరుగుతున్నాయి. దాదాపు 18 ప్రావిన్స్‌లలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా హిలాంగ్‌జియాన్స్ ప్రావిన్స్‌లోని హీహెలో ఒక్కకేసు నమోదైంది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఒక్కకేసు నమోదవ్వడంతో హీహెలో లో లాక్‌డౌన్ అమలుచేస్తున్నారు. హీహెలో నగర జనాభా 6 మిలియన్లు. ఇక్క కేసు నమోదవ్వడంతో లాక్‌డౌన్ విధించి అందరికీ టెస్టులు నిర్వహించడం మొదలుపెట్టారు. ప్రజలెవరూ బయటకు రావొద్దని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Read: కరోనా దెబ్బకు రష్యా అతలాకుతలం…రికార్డ్ స్థాయిలో కేసులు…మరణాలు…