తాము తయారు చేసిన కరోనా టీకాను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకుంటున్నట్టు బ్రిటన్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తెలిపింది. వాణిజ్యపరమైన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.
Covishield : కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ గురించి భారతదేశంలో వ్యాప్తి చెందుతున్న భయం మధ్య, ఐసీఎంఆర్ మాజీ శాస్త్రవేత్త ఉపశమన సమాచారాన్ని అందించారు. కరోనా కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు ఏ విధంగానూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు.
దేశంలో కరోనా మహమ్మారి విజృంభించిన తర్వాత గుండెపోటు కేసులు గణనీయంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో కరోనా టీకా ప్రభావం గుండెపోటు కేసులు పెరగడానికి ఏమైనా కారణమా అనే అనుమానాలు కూడా చాలా పెరిగిపోయాయి.
కరోనా టీకా వేసుకున్న తర్వాత దాని దుష్ప్రభావాల వల్ల తెలంగాణలో 37 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కరోనా టీకా ప్రారంభమైన 2021 జనవరి 16 నుంచి ఈ ఏడాది మార్చ్ 15వ తేదీ వరకు సంభవించిన మరణాలు, టీకా తర్వాత జరిగిన దుష్ప్రభావాలపై ఒక నివేదికను వెల్లడించింది.
Corona Virus: కరోనాకు పుట్టినిల్లు చైనాలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. దీంతో ప్రజలు వైద్యం కోసం ఆసుపత్రుల బాట పడుతున్నారు. చైనాలో కరోనా వ్యాప్తి నిత్యం అంతకంతకూ పెరుగుతోంది.
సూది అవసరం లేకుండానే నోటి ద్వారా తీసుకునే కొవిడ్-19 టీకా పంపిణీని చైనా షురూ చేసింది. చైనాలోని షాంఘై నగరంలో బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ తరహా వ్యాక్సిన్ ప్రపంచంలో మొదటిదని చెబుతున్నారు.
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోసు పంపిణీ వేగం పెంచాలని అధికారులకు మంత్రి హరీశ్ రావ్ ఆదేశించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో DMHOలతో మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలని వైద్య సిబ్బందికి పలు సచనలు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినట్టే తగ్గి మళ్ళీ దేశంలో వేగం పుంజుకుంటోందని ,పోర్త్ వేవ్ కు చేరువలో వున్నామా అన్నట్లు భయాన్ని…
ఐఎస్పీ 20వ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రయాణంలో ఐఎస్‌బీ కీలక మైలురాయికి చేరుకుందని, . 2001లో నాటి ప్రధాని వాజ్‌పేయ్ దీనిని ప్రారంభించారని, ఎంతోమంది కృషి వల్లే ఆసియాలోనే టాప్ బిజినెస్ స్కూల్‌గా అవతరించిందన్నారు. ఐఎస్‌బీ విద్యార్థులు ఎన్నో స్టార్టప్‌లు ప్రారంభించారని పేర్కొన్నారు. G20 దేశాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మన భారతే అన్న ప్రధాని.. ప్రపంచంలో బలమైన స్టార్టప్ ఇకో సిస్టమ్ ఉన్న దేశాల్లో…