కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ ఉత్పత్తిని క్రమంగా తగ్గిస్తున్నట్లు భారత్ బయోటెక్ కంపెనీ శుక్రవారం వెల్లడించింది. టీకా ఒప్పంద కంపెనీలకు సరఫరా పూర్తి కావడం, టీకాకు డిమాండ్ తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది. మరోవైపు వైరస్ వ్యాప్తి తగ్గడం, దాదాపు అందరూ వ్యాక్సిన్ తీసుకోవడంతో కరోనా టీకాలకు డిమాండ్ తగ్గినట్లు అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో టీకా తయారీ కేంద్రాల నిర్వహణ పనులు చేపడతామని.. ఈ సదుపాయాలను మరింత సమర్థంగా వినియోగించే ప్రక్రియలపై దృష్టి…
చైనా సహా పలు దేశాల్లో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో మన దేశంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ బూస్టర్ డోస్ ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది. ఇప్పటికే ఆరోగ్య సిబ్బందితో పాటు 60 ఏళ్లు నిండిన వారికి ప్రికాషనరీ డోస్ పేరుతో మూడో డోస్‌ను కేంద్రం సరఫరా చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో పలు ప్రాంతాలలో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని బూస్టర్ డోసుల పరిధిని పెంచాలని ఆరోగ్యశాఖ…
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేసింది. ఇప్పుడిప్పుడే దాని ప్రభావం తగ్గింది. కానీ అది అంతం కాలేదు. అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్ల నుంచి 14 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభించింది. బయోలాజికల్ ఇ సంస్థ అభివృద్ధి చేసిన కార్బెవాక్స్ (Corbevax) టీకాను అందిస్తోంది. కరోనా వ్యాక్సిన్ పంపిణీని మరింత విస్తరించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూనే వుంది. అమెరికా, బ్రెజిల్ తర్వాత అత్యధిక మరణాలు సంభవించినవి భారత్ లోనే. దేశంలో ఇప్పటివరకూ 5 లక్షలమంది కోవిడ్ 19 కారణంగా మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గత ఏడాది జులై 1కి మనదేశంలో మరణాలు నాలుగు లక్షలు నమోదయ్యాయి. 217 రోజుల్లో మరో లక్ష మరణాలు సంభవించాయి. కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మరణాలు 5,00,055కి చేరాయి. గత 24 గంటల్లో 1,49,394 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.…
ఐదేళ్ల లోపు చిన్నారులకు కరోనా టీకా ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. ఆరు నెలల నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులకు కోవిడ్ టీకా అత్యవసర వినియోగానికి అమెరికా ఔషధ సంస్థ ఫైజర్.. ఎఫ్‌డీఏకు దరఖాస్తు చేసుకుంది. దీనికి అనుమతి లభిస్తే చిన్నారులకు అందుబాటులోకి వచ్చిన తొలి టీకాగా ఫైజర్ నిలవనుంది. అమెరికాలో కరోనా కారణంగా ఆస్పత్రుల్లో చేరుతున్న చిన్నారుల సంఖ్య పెరిగిందని ఫైజర్ తెలిపింది. Read Also: కలవరపెడుతోన్న బీఏ.2 వేరియంట్.. డబ్ల్యూహెచ్‌వో ఆసక్తికర వ్యాఖ్యలు…
సాధారణంగా కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే శరీరంలో యాంటీబాడీలు పెరుగుతాయి. కానీ టీకా తీసుకోవడం ద్వారా దీర్ఘకాలంపాటు రక్షణ లభించే అవకాశమే లేదని ఏషియన్ హెల్త్‌కేర్ ఫౌండేషన్‌తో కలిసి ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. అయితే వ్యాక్సిన్ తీసుకున్న ఆరు నెలల్లోనే 30 శాతం మందిలో యాంటీబాడీలు తగ్గిపోతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. Read Also: భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు… ఒక్కరోజులో.. ముఖ్యంగా 40 ఏళ్లు దాటి మధుమేహం, అధిక రక్తపోటు…
ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (AIG) చేత హైదరాబాద్‌లో కోవిడ్ వ్యాక్సిన్‌లు పొందిన 1,636 మంది ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలపై ఒక సంచలనాత్మక దీర్ఘకాలిక అధ్యయనం, వయస్సుతో పాటు, కోవిడ్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి స్థాయిలు కూడా క్షీణిస్తాయని సూచించింది. “మా అధ్యయన ఫలితాలు ఇతర ప్రపంచ అధ్యయనాలతో సమానంగా ఉన్నాయి. ఇక్కడ దాదాపు 30 శాతం మంది వ్యక్తులు 6 నెలల తర్వాత రక్షిత రోగనిరోధక శక్తి స్థాయిల కంటే యాంటీబాడీ స్థాయిలను కలిగి ఉన్నారని…
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న విద్యార్థులనే స్కూళ్లలోకి అనుమతిస్తామని హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ ప్రకటించారు. ఈ మేరకు 15-18 ఏళ్లలోపు విద్యార్థులు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని.. అలా వ్యాక్సిన్ తీసుకున్న వారు మాత్రమే స్కూళ్లకు హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. Read Also: పంది గుండెతో మొదటి ప్రయోగం మనవాడిదే… కానీ! కరోనా కారణంగా ప్రస్తుతం హర్యానా ప్రభుత్వం స్కూళ్లను మూసివేసింది.…
వైద్య రంగంలోకి కొన్ని అద్భుతమైన ఘట్టాలు వెలుగుచూస్తూ ఉంటాయి.. దేనికోసమో తయారు చేసిన మందు.. మరో రోగాన్ని నయం చేస్తుంది.. అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాక జుట్టు పీకోవాల్సిన పరిస్థితులు తెచ్చిపెట్టిన సందర్భాలు ఎన్నో.. తాజాగా, అలాంటి ఘటనే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది.. ప్రపంచం వెన్నులో వణుకుపుట్టిన కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు తయారు వేస్తున్న వ్యాక్సినేషన్‌తో.. మంచానికే పరిమితమైన ఓ వ్యక్తి అమాంతం లేచి నిలబడ్డాడు.. నోట మాటలు రాని ఆ…
కరోనా కేసుల తీవ్రత రోజూ పెరుగుతోంది. వైద్యులు, వైద్య విద్యార్ధుల్ని కూడా మహమ్మారి వదలడం లేదు. కరోనా వేళ గర్భిణులకు సర్కారు భరోసా ఇచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర సర్వీసులను మాత్రమే చూడాలని ఆదేశాలున్నా కోవిడ్ బాధిత గర్భిణుల కోసం ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. ఆదివారం కూడా కరోనా వాక్సినేషన్, టెస్టింగ్ చేయాలన్నారు. ఆపరేషన్ థియేటర్లు, వార్డుల కేటాయింపు ..ఇతర పాజిటివ్ బాధితులకు అత్యవసర సేవలు, శస్త్ర చికిత్సల…