PM Modi: జీ20 దేశాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మనదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐఎస్పీ 20వ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రయాణంలో ఐఎస్‌బీ కీలక మైలురాయికి చేరుకుందని, . 2001లో నాటి ప్రధాని వాజ్‌పేయ్ దీనిని ప్రారంభించారని, ఎంతోమంది కృషి వల్లే ఆసియాలోనే టాప్ బిజినెస్ స్కూల్‌గా అవతరించిందన్నారు. ఐఎస్‌బీ విద్యార్థులు ఎన్నో స్టార్టప్‌లు ప్రారంభించారని పేర్కొన్నారు. G20 దేశాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మన భారతే అన్న ప్రధాని.. ప్రపంచంలో బలమైన స్టార్టప్ ఇకో సిస్టమ్ ఉన్న దేశాల్లో భారత్ మూడొదని పేర్కొన్నారు. భారత్‌కు రికార్డ్ స్థాయిలో విదేశీ పెట్టుబడులు వస్తున్నాయన్నారు.
ఇండియా అంటే ఇప్పుడు బిజినెస్ అనే స్థాయికి ఎదిగిందని.. మన దేశ యువత ప్రపంచానికే నాయకత్వం వహిస్తుందని ప్రధాని చెప్పారు. ‘‘మీ వ్యక్తిగత లక్ష్యాలను.. దేశ లక్ష్యాలతో కలపండి.. ఆ దిశగా ఆలోచించండి’’ అని విద్యార్థుల్ని ప్రోత్సాహించారు. మీ మీద నమ్మకంతో ముందడుగు వేయాలని జోష్ నింపారు. దేశ యువతకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. రాజకీయ అస్థిరత వల్ల దేశం గత మూడు దశాబ్దాలుగా పాలసీ నిర్ణయాలు తీసుకోలేకపోయిందని, అయితే గడిచిన 8 ఏళ్లుగా దేశ యువత కోసం నిరాటంకంగా సంస్కరణలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రపంచంలో 40 శాతం బ్యాంకింగ్ డిజిటల్ లావాదేవీలు ఇండియాలో జరుతున్నాయన్ని ప్రధాని వెల్లడించారు.
Also Read
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
- Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
- OTR: కేంద్రమంత్రి పెమ్మసాని పై తెలంగాణ బీజేపీ ఎంపీలు అసహనం .. అసలు కారణమేంటి ?
- TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
కరోనా సమయంలో పిపిఈ కిట్ తయారీ కంపెనీలు ఇండియాలో లేవని.. కానీ చూస్తుండగానే 11 వందల పిపిఈ కిట్‌లు తయారు చేసే కంపెనీల నెట్‌వర్క్ ఏర్పటైందని ప్రధాని మోదీ తెలిపారు. మొదట్లో మనకు విదేశీ వ్యాక్సిన్ దొరుకుతుందో లేదోనని ఆందోళన దేశ ప్రజలు ఆందోళన చెందేవాళ్ళని.. కానీ ఆ వ్యాక్సిన్‌ను దేశీయంగా అభివృద్ధి చేసుకున్నామన్నారు. ఎనిమిది ఏళ్లుగా దేశంలో మెడికల్ కాలేజీల సంఖ్య పెంచుకున్నామన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేశానికి ఎఫ్‌డీఐ(FDI)లు వచ్చాయని ప్రధాని మోదీ చెప్పారు.
తాజావార్తలు
-
Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..