కరోనా మహమ్మారి ఆట కట్టించేందుకు దేశంలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్నది. ఇప్పటి వరకు దేశంలో 21 కోట్లమందికి వ్యాక్సిన్ అందించారు. మే నెలలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కోసం 7.9 కోట్ల డోసులను అందుబాటులో ఉంచగా, జూన్ నెలలో 12కోట్ల డోసులను అందుబాటులో ఉంచినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో కేంద్రం 6.09 కోట్ల డోసులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా సరఫరా చేయనుండగా, 5.86 కోట్ల డోసులు రాష్ట్రాలు, ప్రైవేట్ ఆసుపత్రులు సేకరించేందుకు…
దేశంలో కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతోంది. అటు మరణాల సంఖ్య కూడా పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నాయి. కరోనా కేసులతో పాటు ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కేసులు కూడా దేశాన్ని భయపెడుతున్నాయి. రోజు రోజుకు ఈ కేసులు పెరుగుతుండటం అంధోళన కలిగిస్తోంది. నార్త్ ఇండియాలోనే బ్లాక్ ఫంగస్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. హర్యానాలో బ్లాక్ ఫంగస్ కేసులు ఆంధోళన కలిగిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో 650కి పైగా కేసులు నమోదవ్వగా, 50 మందికి పైగా మరణాలు నమోదయ్యాయి. బ్లాక్…
కరోనా మహమ్మారి ఎటు నుంచి ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం కష్టంగా మారింది. కరోనా కోసం అనేక రకాల వైద్య సౌకర్యాలను, మందులను, వ్యాక్సిన్‌లను అందుబాటులోకి తీసుకోచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు మరో ఔషదం అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన రిజెనరాన్ సంస్థ తయారు చేసిన మోనోక్లోనాల్ యాంటీబాడీస్ కాక్‌టెయిల్ మెడిసిన్‌ను గతంతో ట్రంప్ కరోనా బారిన పడినపుడు ఆయనకు అందించారు. ఈ మెడిసిన్ తీసుకున్నాక ట్రంప్ వేగంగా కోలుకున్నారు. అయితే, విదేశాల్లో ఈ…
కరోనా మహమ్మారి కొత్త సమస్యలను సృష్టిస్తోంది. కరోనా సోకిన వారి కంటే, ఎక్కడ కరోనా సోకుతుందో అని భయపడి నిద్రకు దూరమైన వ్యక్తుల సంఖ్య నానాటికి పెరుగుతున్నది. దీంతో నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు కొత్త కొత్త అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా నుంచి బయటపడిన వ్యక్తులు కూడా సామాజికంగా దూరాన్ని పాటించాల్సి రావడంతో మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని, నిద్రలేమి కారణంగా మరికొన్ని అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. కరోనా తరువాత…
కరోనా మహమ్మారికి ఎక్కడ ఎలాంటి మందు ఇస్తున్నారని తెలిసినా అక్కడికి పరిగెత్తుకు వెళ్తున్నారు ప్రజలు. ఆనందయ్య మందు కరోనాకు పనిచేస్తుందిని ప్రచారం జరగడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి రానివి ఇంకా చాలానే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే, పులివెందులలో కరోనా నివారణకు ఆకు పసరు పేరుతో మందు పంపిణీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పులివెందుల ఆర్డీవో నాగన్న పసరు పంపిణీని అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా పసరును ప్రజలకు ఎలా సరఫరా చేస్తారని ఆగ్రహం…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. 2019 డిసెంబర్‌లో చైనాలో మొదటగా ఈ వైరస్‌ను గుర్తించారు. ఆ తరువాత ఈ వైరస్ ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాపించింది. అయితే, ఈ వైరస్ మూలాలను ఇప్పటి వరకు గుర్తించలేదు. కరోనా వైరస్ మూలాలపై తనకు మూడు నెలల్లో నివేదక అందజేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యూఎస్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీని ఆదేశించారు. చైనాలో మొదట కనిపించిన ఈ వైరస్ జంతువుల నుంచి వచ్చిందా లేదంటే ప్రయోగశాలలో ప్రమాదం…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నదో చెప్పాల్సిన అవసరం లేదు. మహమ్మారి మొదటి వేవ్‌ను దాదాపుగా అన్ని దేశాలు లైట్‌గా తీసుకోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. అటు బ్రిటన్ కూడా ఈ మహమ్మారిని లైట్‌గా తీసుకున్నది. ప్రజల్లో భయాంధోళనలు కలిగించకూడదనే ఉద్దేశ్యంతో బ్రిటన్ ప్రధాని లైవ్‌లో కరోనా వైరస్‌ను ఎక్కించుకుంటానని ఆయన సన్నిహితులతో చెప్పారట. ఈ విషయాన్ని ఎయిడ్ డొమినిక్ కమ్మిన్స్ బయటపెట్టారు. ప్రజల్లో భయం పోగొట్టేందుకు ప్రధాని బోరిస్ జాన్సన్ అలా చెప్పినట్టు…
ఒకవైపు కరోనా మహమ్మారి దేశాన్ని భయపెడుతుంటే, మరోవైపు బ్లాక్ ఫంగస్ వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రోజురోజుకూ దేశంలో బ్లాక్‌ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. ఇక ఏపీలో బ్లాక్ ఫంగస్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. విజయవాడ నగరాన్ని బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. నగరంలో ఈ కేసులతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతున్నది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే 50కి పైగా ఈ కేసులు నమోదయ్యాయి. అటు ప్రైవేట్…
తెలంగాణలో కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపులు ఉన్నాయి. 10 గంటల నుంచి తిరిగి తెల్లవారి 6 గంటల వరకు లాక్‌డౌన్ అమలులో ఉంటుంది. కేవలం నాలుగు గంటల పాటు మాత్రమే సడలింపులు ఉన్నాయి. అయితే, మే 30 వ తేదీతో లాక్‌డౌన్ సమయం ముగుస్తుంది. మే 30 తరువాత లాక్ డౌన్ కొనసాగిస్తారా లేదంటే ఎత్తివేస్తారా అనే విషయంపై ఈ నెల…
కృష్ణపట్నం ఆనందయ్య మందుపై పరిశోధన మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. సీసీఆర్ఏఎస్ ఆదేశాల మేరకు విజయవాడ, తిరుపతి కేంద్రంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే మందు స్వీకరించిన వారి వివరాలను నెల్లూరు జిల్లా యంత్రాంగం పరిశోధనా కేంద్రాలకు అందించింది. తిరుపతి ఆయుర్వేద కళాశాల కేంద్రానికి కేటాయించిన 250 మంది కాల్ లిస్టులో 70 మంది వివరాలు తెలియకపోవడంతో అదనంగా తిరుపతి కేంద్రానికి మరో 60 మంది డిటైల్స్ నే జిల్లా అధికారులు పంపించారు. అయితే, మందు పంపిణీ సమయంలో…