కృష్ణపట్నం ఆనందయ్య మందుపై పరిశోధన మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. సీసీఆర్ఏఎస్ ఆదేశాల మేరకు విజయవాడ, తిరుపతి కేంద్రంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే మందు స్వీకరించిన వారి వివరాలను నెల్లూరు జిల్లా యంత్రాంగం పరిశోధనా కేంద్రాలకు అందించింది. తిరుపతి ఆయుర్వేద కళాశాల కేంద్రానికి కేటాయించిన 250 మంది కాల్ లిస్టులో 70 మంది వివరాలు తెలియకపోవడంతో అదనంగా తిరుపతి కేంద్రానికి మరో 60 మంది డిటైల్స్ నే జిల్లా అధికారులు పంపించారు. అయితే, మందు పంపిణీ సమయంలో ఆనందయ్య ఎవరి వివరాలు సేకరించకపోవడంతో పరిశోధనకు పంపిన వివరాలు ప్రశ్నార్ధకంగా మారాయి. దీంతో ఈ పరిశోధన మరింత ఆలస్యంగా మారే అవకాశం ఉన్నది. పరిశోధన ప్రక్రియ ఆలస్యమైతే ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.