కరోనా మహమ్మారి ఎటు నుంచి ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం కష్టంగా మారింది. కరోనా కోసం అనేక రకాల వైద్య సౌకర్యాలను, మందులను, వ్యాక్సిన్‌లను అందుబాటులోకి తీసుకోచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు మరో ఔషదం అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన రిజెనరాన్ సంస్థ తయారు చేసిన మోనోక్లోనాల్ యాంటీబాడీస్ కాక్‌టెయిల్ మెడిసిన్‌ను గతంతో ట్రంప్ కరోనా బారిన పడినపుడు ఆయనకు అందించారు. ఈ మెడిసిన్ తీసుకున్నాక ట్రంప్ వేగంగా కోలుకున్నారు. అయితే, విదేశాల్లో ఈ మెడిసిన్‌ను తయారు చేసే బాధ్యతలను స్విస్ కు చెందిన రోచ్ సంస్థకు అప్పగించింది. కాగా, రోచ్‌తో సిప్లా సంస్థతో ఒప్పందం చేసుకుంది. కాగా, సిప్లా సంస్థ తొలివిడతలో భాగంగా లక్ష ప్యాక్‌ల మెడిసిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. తొలిసారి ఈ వ్యాక్సిన్ ను గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో 84 ఏళ్ల రోగిపై ప్రయోగించారు. ఈ కాక్‌టెయిల్ మెడిసిన్ తీసుకున్న రోగి వేగంగా కోలుకొని డిశ్చార్జ్ కావడంతో ఈ ఔషదంపై నమ్మకం పెరిగింది. గురుగ్రామ్ తో పాటుగా అనేక నగరాల్లో ఈ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.