కరోనా మహమ్మారి కొత్త సమస్యలను సృష్టిస్తోంది. కరోనా సోకిన వారి కంటే, ఎక్కడ కరోనా సోకుతుందో అని భయపడి నిద్రకు దూరమైన వ్యక్తుల సంఖ్య నానాటికి పెరుగుతున్నది. దీంతో నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు కొత్త కొత్త అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా నుంచి బయటపడిన వ్యక్తులు కూడా సామాజికంగా దూరాన్ని పాటించాల్సి రావడంతో మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని, నిద్రలేమి కారణంగా మరికొన్ని అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. కరోనా తరువాత ఎదురౌతున్న సమస్యలను కరోనాసోమ్నియాగా పిలుస్తున్నారు. ఈ సమస్యల నుంచి బయటపడాలి అంటే నెగెటీవ్‌గా ఆలోచించడం మానేసి రోజూ తగినంత వ్యాయామం, పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.