ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతూనే వుంది. అమెరికా వంటి దేశాల్లో కేసులు 8 లక్షల వరకూ వుండడం ఆందోళన కలిగించాయి. తాజాగా అన్ని దేశాల్లోనూ కరోనా కేసులు తీవ్రంగా వచ్చిపడుతున్నాయి. దీంతో విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. తాజాగా పసిఫిక్ దీవుల్లోని కొన్నిదేశాల్లో ఇప్పటిదాకా అక్కడ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కానీ, ఒమిక్రాన్ పుణ్యమా అని వేరే దేశాల నుంచి వచ్చినవారితో అక్కడ తొలిసారి కేసులు నమోదయ్యాయి. దీంతో కిరిబాటి, సమోవ వంటి…
పెద్దపల్లి జిల్లాలో ఉన్న రామగుండం ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో (రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్) సాంకేతిక కారణాలుతో పాటు పలువురు సిబ్బందికి కరోనా సోకడంతో ఫ్యాక్టరీలో ఉత్పత్తిని యాజమాన్యం నిలిపి వేసింది. ఆర్ఎఫ్‌సీఎల్‌లోని ప్రిల్లింగ్‌టవర్‌లో ఏర్పడ్డ సాంకేతిక అంశాలతోపాటు పలువురు శాశ్వత ఏర్పడ్డ ,ఒప్పంద ఉద్యోగులుకు కరోనా రావడంతో కర్మాగారంలో ఉత్పత్తి పనులను నిలిపివేసినట్టు యాజమాన్యం ప్రకటించింది. Read Also: తెలంగాణలో పలు జిల్లాలకు అదనపు కలెక్టర్ల కేటాయింపు సుమారు 120 మంది ఒప్పంద కార్మికులతో పాటు పలువురు…
తమిళనాడు కరోనాతో వణికిపోతోంది. తమిళనాడులో కరోనా కొత్త కేసులు వెల్లువలా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం (జనవరి 23) నాడు రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్టు సీఎం స్టాలిన్ ప్రకటించారు. లాక్ డౌన్ శనివారం రాత్రి 10 గంటలకు ప్రారంభమై సోమవారం ఉదయం 5 గంటలకు ముగుస్తుంది. అయితే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఎయిర్ పోర్టులకు వెళ్లే ట్యాక్సీలు, ఆటోలకు మినహాయింపు ఇచ్చారు. గురువారం ఒక్కరోజే తమిళనాడులో 28,561 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో కరోనా వీరవిహారం…
తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ రోజు కొత్తగా 4,207 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు 7,22,403గా ఉన్నాయి. కాగా కరోనాతో కోలుకున్న వారి సంఖ్య1,825గా ఉంది. ఇప్పటి వరకు కరోనాతో కోలుకుని డిశాచార్జీ అయిన వారి సంఖ్య 6,91,703 గా ఉంది. ఈ రోజు కరోనాతో ఇద్దరూ మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 4,067గా ఉంది. కరోనాతో చికిత్స పొందుతున్న…
దేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. థర్డ్ వేవ్ కారణంగా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,17,532 కరోనా కేసులు నమోదవ్వగా, గడిచిన 24 గంటల్లో 491 మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో గడిచిన 24 గంటల్లో 2,23,990 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటే, దేశంలో ప్రస్తుతం 19,24,051 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 16.41శాతంగా ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం…
కరోనా తీవ్రతపై షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. తాజాగా తెలంగాణలో 20 లక్షల మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ సర్వేలో తేలింది. వచ్చే రోజుల్లో కేసుల సంఖ్య మరింతగా పెరగవచ్చని అంచనా వేసింది. గతేడాది డిసెంబర్ రెండో వారం నుంచి ఏఎన్ఎంలు,అంగన్వాడీలు, ఆశవర్కర్లు చేసిన ఫీవర్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఒక్క హైదరాబాద్‌లోనే 15 లక్షల మందికి పైగా కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది. త్వరలోనే ఈ సర్వే వివరాలను వైద్యారోగ్య శాఖ ప్రభుత్వానికి…
ఏపీలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఇప్పటికే నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో 10,057 కరోనా కేసులు నమోదైనట్టు ఏపీ ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 8 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,27,441కి చేరింది. ఇందులో 20,67,984 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 44,935 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం…
ప్రస్తుతం దేశంలో కరోనా థర్డ్ వేవ్ నడుస్తోంది. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా దాదాపు 3 లక్షల కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. గత రెండేళ్లుగా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కరోనా ఎప్పటికీ నాశనం అవుతుందోనని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా ఎప్పటికి అంతమవుతుందో అన్న అంశంపై ఐసీఎంఆర్ అధికారి స్పందించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మార్చి 11 నాటికి కరోనా కథ ముగిసిపోతుందని ఐసీఎంఆర్ ఎపిడెమాలజిస్ట్ చీఫ్ డా.సమీరన్ పాండా వెల్లడించారు. Read…
కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. తెలంగాణలో క్రమేపీ కరోనా ఉగ్రరూపం దాల్చడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా శాంతి భద్రతలు, ట్రాఫిక్ విధులు నిర్వర్తించే పోలీసులను కరోనా కలవరపెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు1,400 మంది పోలీసులకు కరోనా రావడంతో డిపార్ట్మెంట్ అలర్ట్ అయ్యింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌లో పోలీసుల్లో పాజిటివ్ ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 500 మందికి పైగా పోలీసులు కరోనా బారినపడ్డారు.…