తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 65,263 కరోనా పరీక్షలు చేయగా… 2,484 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,045 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 138, రంగారెడ్డి జిల్లాలో 130, నల్గొండ జిల్లాలో 108, ఖమ్మం జిల్లాలో 107 కేసులు గుర్తించారు. అదే సమయంలో 4,207 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,61,050 పాజిటివ్ కేసులు నమోదు కాగా……
సరిగ్గా రెండేళ్ల క్రితం భారత్ లో కరోనా తొలికేసు నమోదైంది. రెండేళ్ల కాలంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కరోనా తొలికేసు నమోదైనపుడు దేశంలో తెలియని భయం నెలకొన్నది. కరోనా కేసులు నమోదైతే వాటిని టెస్ట్ చేసేందుకు సరైన కిట్లు, వ్యాక్సిన్లు అప్పట్లో అందుబాటులో లేవు. దీంతో కరోనా సోకితే ఏ మెడిసిన్ వాడాలి అన్నది సందిగ్ధంగా మారింది. రెండేళ్ల కాలంలో దేశంలో నాలుగు కోట్లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 4 లక్షల 94 వేల…
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుంది. నేడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 10,310 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా శనివారంతో పోలిస్తే.. ఈ రోజు రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు 1,263 కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా…
గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా నుంచి బయటపడేందుకు ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. వ్యాక్సిన్లు, ఆహరపు అలవాట్లు తదిత అంశాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల సారాంశాన్ని ఫ్రాంటియర్స్ ఇన్ న్యూట్రీషన్ అనే జర్నల్‌లో ప్రచురించారు. ఈ జర్నల్ ప్రకారం, వారానికి నాలుగు నుంచి 5 గ్లాసుల వరకు రెడ్ వైన్ తీసుకునేవారు కరోనా మహమ్మారి బారిన పడటం 17 శాతం వరకు తక్కువుగా ఉంటుందని పరిశోధకులు…
కరోనా మహమ్మారి గత రెండేళ్లుగా ప్రపంచాన్ని ఇబ్బందులు పెడుతూనే ఉన్నది. రోజువారీ కేసులు లక్షల్లోనమోదవుతున్నాయి. థర్డ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. కరోనా కేసులు నమోదవుతున్నా తీవ్రత తక్కువగా ఉండటంతో కరోనా బారిన పడినప్పటికీ త్వరగా కోలుకుంటున్నారు. అయితే, యూఏఈలో పనిచేస్తున్న ఓ భారతీయ ఫ్రంట్‌లైన్ వర్కర్ ఆరు నెలల క్రితం కరోనా బారిన పడ్డాడు. అప్పటి నుంచి కరోనాతో పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఆసుపత్రిలో గత ఆరునెలలుగా చికిత్స పొందుతూ ఎట్టకేలకు కోలుకున్నాడు. గురువారం రోజున ఆసుపత్రి…
ఇండియాలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతున్నది. గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా దేశంలో 2,51,209 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 627 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య నిన్నటి కంటే స్వల్పంగా పెరిగింది. అయితే,కోలుకున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్టు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. 24 గంటల వ్యవధిలో 3,47,443 మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో…
ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తాజాగా దేశంలో గడిచిన 24 గంటల్లో 2,86,384 కేసులు నమోదవ్వగా, 573 మంది కరోనాతో మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దేశంలో గడిచిన 24 గంటల్లో 3,06,357 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల కంటే రికవరీ కేసులు కాస్త పెరగడం ఊటరనిచ్చేవిషయం. ఇక దేశంలో 22,02,472 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 19.59శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 163,84,39,207 మందికి వ్యాక్సినేషన్…
భారత్‌లో మరోసారి కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం దేశంలో 2,55,874 కరోనా కేసులు నమోదు కాగా.. బుధవారం మాత్రం 2,85,914 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కరోనా మరణాలు కూడా పెరిగాయి. మంగళవారం 614 మంది మృతి చెందగా… బుధవారం 665 మంది కరోనాతో మరణించారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,00,85,116కి చేరింది. కరోనా మరణాల సంఖ్య 4,91,127కి పెరిగింది.…
ఎన్ని జాగ్రత్తలు చెప్పినా ప్రజల్లో నిర్లక్ష్యం తగ్గడం లేదు. తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే ఉంది. కొత్తగా మళ్లీ 4వేలకు పైగానే కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు పెద్ద సంఖ్యలోనే కొత్త కేసులు బయటపడ్డాయి.సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాలకు వెళ్ళివచ్చినవారు పరీక్షలు చేయించుకోగా కేసులు పెరిగాయని తెలంగాణ వైద్యారోగ్యశాఖ తెలిపింది. 24గంటలలో 1 లక్షా 13 వేల 670 టెస్టులు చేయగా.. 4,559మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 1961మంది కోలుకోగా.. ఇద్దరు…