తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ రోజు కొత్తగా 4,207 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు 7,22,403గా ఉన్నాయి. కాగా కరోనాతో కోలుకున్న వారి సంఖ్య1,825గా ఉంది. ఇప్పటి వరకు కరోనాతో కోలుకుని డిశాచార్జీ అయిన వారి సంఖ్య 6,91,703 గా ఉంది. ఈ రోజు కరోనాతో ఇద్దరూ మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 4,067గా ఉంది. కరోనాతో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 26,633 గా ఉంది. రివరీ రేటు 95.75 శాతంగా ఉంది.
Read Also: ఎల్కతుర్తి – సిద్ధిపేట రోడ్డు విస్తరణ పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
కాగా ఈ రోజు 1,20,215 శాంపిల్స్‌ను సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇంకా 10,136 పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. కాగా ఇప్పటికే కరోనా రోజు రోజుకు పెరుగుతుండటంలో వైద్యాధికారులు భయాందోళనలు చెందుతున్నారు. ఇదిలా ఉంటే సంక్రాంతి పండుగ తర్వాత కేసులు ఒక్కసారిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చినప్పట్టికీ ప్రజలు మాత్రం రోజు రోజు పెరుగుతున్న కేసులతో భయాందోళనలకు గురి అవుతున్నారు. అందరూ కరోనా నిబంధనలు పాటించాలని వైద్యాధికారులు చెబుతున్నారు.