దేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. థర్డ్ వేవ్ కారణంగా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,17,532 కరోనా కేసులు నమోదవ్వగా, గడిచిన 24 గంటల్లో 491 మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో గడిచిన 24 గంటల్లో 2,23,990 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటే, దేశంలో ప్రస్తుతం 19,24,051 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 16.41శాతంగా ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో మొత్తం 9,287 ఒమిక్రాన్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. మహారాష్ట్రలో అత్యధికంగా 43,697 కరోనా కేసులు నమోదవ్వగా, కర్ణాటకలో 40,499 కరోనా కేసులు, కేరళలో 34,199 కరోనా కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతుండటంతో కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.