Eatala Rajendar: ముసలికన్నీరు కార్చే కాంగ్రెస్‌కి చెంపపెట్టులా దేశంలో కులగణన..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eatala Rajendar: కేంద్రం చేపట్టబోతున్న కులగణనపై ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. ఈ ప్రకటన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు గౌరవాన్ని కలిగించడమే కాకుండా.. చరిత్రాత్మక నిర్ణయంగా పేర్కొన్నారు. ఈటల మాట్లాడుతూ.. స్వతంత్ర భారతదేశంలో 48 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ బీసీల జనగణన చేపట్టలేదని, అణగారిన వర్గాలకు ఛాంపియన్‌లా నటిస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీల ఓట్లను మాత్రమే కొల్లగొట్టారని కాంగ్రెస్ ను విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు తగిన చర్యలు తీసుకోకుండా, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కంటతడి పారిస్తుండటం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీ 2014లో ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ప్రధాని చేయడం ద్వారా చరిత్ర సృష్టించింది. అలాగే 2021లో ఆదివాసి వర్గానికి చెందిన బిడ్డను రాష్ట్రపతిగా నియమించింది. ఇది బీజేపీ అణగారిన వర్గాల పట్ల ఉన్న కట్టుబాటుకు నిదర్శనం అని అన్నారు.
Read Also: Revanth Reddy: కార్మిక లోకానికి ‘మే’ డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం!
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
ఈ సందర్బంగా ఈటల రాజేందర్ కేంద్ర మంత్రివర్గంలో సామాజిక న్యాయం ఎలా ప్రతిబింబించిందో వివరించారు. 27 మంది ఓబీసీలు, 12 మంది ఎస్సీలు, 8 మంది ఎస్టీలు, 5 మంది మైనారిటీలు ఇలా మొత్తం 60 శాతం మంది అణగారిన వర్గాలకు చెందిన వారే మంత్రివర్గంలో ఉన్నారని వివరించారు. దేశవ్యాప్తంగా కులగణన జరగడం కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటిదే అని విమర్శించారు. ఇది ఓబీసీలకు గుర్తింపు కలిగించే చర్యగా అభివర్ణించారు. రాజకీయ, సామాజిక, విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఈ వర్గాలకు మరింత ప్రాధాన్యం కలుగుతుందని తెలిపారు.
Read Also: Bandi Sanjay Kumar: జాతీయ కాంగ్రెస్ కులగణన వ్యతిరేకి.. కేంద్రమంత్రి హాట్ కామెంట్స్!
కేంద్రం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులకి కృతజ్ఞతలు తెలుపుతూ, బీజేపీ మాత్రమే అణగారిన వర్గాలకు నిజమైన అండగా నిలుస్తోందని ఈటల రాజేందర్ స్పష్టంగా తెలిపారు. ఇది ఒక దృఢమైన రాజకీయ ప్రకటనగా మాత్రమే కాకుండా, సామాజిక న్యాయానికి మార్గదర్శకంగా నిలిచే చర్యగా విపక్షాలపై విమర్శలు చేస్తూ ఈటల అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!