రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటలకే మొదలైంది. ఉదయం పలు కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గంలోని హిమ్మత్‌నగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ భార్య శ్వేత మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నాన్ లోక్సల్స్ ఎందుకు నియోజకవర్గంలో ఉన్నారంటూ, ఓటర్లను ప్రలోభ పెడుతోందంటూ తుల ఉమను గెల్లు శ్వేత…
సాగు చట్టాలపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు తాత్కాలిక బారికేడ్లను మాత్రమే తొలగించారు. త్వరలోనే కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలు ఉపసంహరణ కానున్నాయన్నారు. అన్నదాతల సత్యాగ్రహం భేష్ అంటూ ట్వీట్ చేశాడు. కాగా రైతుల ఆందోళన నేపథ్యంలోఏడాదిగా మూతపడిన ఢీల్లీ- ఉత్తరప్రదేశ్ సరిహద్దులను అధికారులు ఇవాళ తెరిచారు. రానున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతుంది. ఇప్పటికే ప్రియాంక గాంధీతో ఎన్నికలకు సమయం…
ఇన్నాళ్ళ నిరీక్షణకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. హుజురాబాద్ నియోజకవర్గానికి జరగనున్న పోలింగ్‌పై అంతా ఉత్కంఠ నెలకొంది. 2019 ఎన్నికలలో ఈటల రాజేందర్ … అప్పటి కాంగ్రెస్ ప్రత్యర్థి కౌశిక్ రెడ్డిపై 43,719 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ పార్టీ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2021లో ఆయన అసైన్డ్ భూములు కొన్నారనే ఆరోపణలపై తన పదవికి రాజీనామా చేశారు. అంతే కాకుండా తన శాసన సభ పదవికి మరియు టీఆర్ఎస్ సభ్యత్వానికి కూడా రాజీనామా…
కేసీఆర్ అసమర్థతతోనే ప్రాజెక్టులన్ని సమాధి అవుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయనా మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పై NGT స్టే ఇచ్చిందని, పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మించడానికి చూశారు .. ఇప్పుడు పనులు మధ్యంతరంగా ఆగిపోయాయన్నారు. కేసీఆర్‌కు కొందరు కాంట్రాక్టర్లు ఇచ్చిన సలహా మేరకు, ప్రాజెక్ట్ రీ డిజైనింగ్ చేశారు. మూడేళ్లలో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టు ఆరేళ్లయినా పూర్తి కాలేదన్నారు. ప్రభుత్వం అసమర్థత…
హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్‌కు ఇంకా కొన్ని గంటల సమయమే ఉంది. ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికలకు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ హోరా హోరీ ప్రచారం నిర్వహించాయి. ప్రచారపర్వం ముగిసిన క్షణం నుంచి ప్రలోభాల పర్వం మొదలైంది. ఇప్పుడు నియోజకవర్గంలో ఓటర్ల కొనుగోలు కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నట్టు కనబడుతోంది. ఒక్క ఓటుకు వేలల్లో ధర పలుకుతున్నట్టు సమాచారం. పార్టీల నుంచి డబ్బు అందని ఓటర్లు రోడ్డెక్కి ధర్నాలకు దిగటం ఈ ఎన్నికల్లో హైలైట్. ఇలాంటివి గతంలో ఎన్నడూ…
దేశంలో సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ సీడబ్యూసీ మెంబర్ చింతామోహన్ . దేశ పరిస్థితులు బాగాలేవని, ధరలు బాగా పెరిగిపోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. వంటగ్యాస్ ధర మళ్ళీ పెరగబోతోందన్నారు. గ్యాస్ సిలిండర్ వెయ్యిరూపాయలు దాటబోతోందని, పెట్రోల్ డిజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆయన అన్నారు. భారత్ దేశంలో ఆకలి కేకలు ఎక్కువగా ఉన్నాయని, నిరుద్యోగం బాగా పెరిగిపోయిందని విమర్శించారు చింతా మోహన్. ఒకవైపు సామాన్యుడు వందరూపాయలు సంపాదించలేక ఆకలితో అలమటించి పోతుంటే..…
సిద్ధిపేట కలెక్టర్ రైతులపై మాట్లాడిన మాటలు నియంతలా ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దేవుళ్లతో సమానమని తెలిపారు. కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రైతులకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ – బీజేపీ ప్రభుత్వాలు డ్రామాలు ఆడుతున్నాయన్నారు. రైతుల పొట్టగొట్టి నడ్డి విరిచి రోడ్డు పాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని జగ్గారెడ్డి విమర్శించారు. వరి పంటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరోసా ఇవ్వాలన్నారు. బండి సంజయ్, తెలంగాణ మంత్రులు…
హుజురాబాద్ ఉప ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషనర్ శ్రీ సుశీల్ చంద్ర ను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్టు ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి శ్రీ దాసోజు శ్రవణ్, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు కుసుమ కుమార్, హర్కర వేణుగోపాల్ తదితర తెలంగాణ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. అడ్డగోలుగా అక్రమాలు, ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తూ హుజురాబాద్‌లో ఓటర్లను టీఆర్ఎస్,…
అసంతృప్త జ్వాలలు తారాస్థాయికి చేరడంతో మాజీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారా? పాతవాళ్లు వెళ్లిపోతున్నా పార్టీ పెద్దలకు పట్టడం లేదా? ఇంతకీ ఏంటా పార్టీ? మాజీ ఎమ్మెల్యేలు ఎవరు? తలోదిక్కుకు పోతున్న పార్టీ కేడర్..! మేడ్చల్ జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్‌కు బలమైన నాయకత్వం.. కేడర్ ఉండేది. అలాంటి జిల్లాలో నేడు ఒక్కో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌ను వీడి వెళ్లిపోతున్నారు. కూన శ్రీశైలం గౌడ్‌తో మొదలైన రాజీనామాల పర్వం ప్రస్తుతం ఆకుల రాజేందర్ దగ్గర ఆగింది. ఉమ్మడి…
హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ మాట్లాడుతూ.. గత నెల 28న హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిననాటి నుంచి నేటి వరకు కరీంనగర్ కమిషనరేట్, వరంగల్ కమిషనరేట్ సంబంధించి కమలాపూర్ మండల పరిధిలో ఎన్నికల దృష్ట్యా 10 చెక్ పోస్టులు, 10 ఫ్లయింగ్ స్క్వాడ్, 5 ఏంసీసీ, 10 వీఎస్టీ లను ఏర్పాటు చేసి, పకడ్బందీగా ఎన్నికల నియమావళిని అమలు చేస్తున్నామని తెలిపారు. తనిఖీల్లో…