కేసీఆర్ రాష్ర్టంలో రహస్యంగా పర్యటించాలంటూ కాంగ్రెస్ సీనియర్నేత జగ్గారెడ్డి అన్నారు. గతంలో ఎంతో మంది రాజులు ఇలాగే చేశారన్నారు. అప్పుడే రైతుల సమస్యలు తెలుస్తాయన్నారు. వరిధాన్యం కొనకుండా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు రైతులతో చెలగాటం ఆడుతున్నాయన్నారు. ఇప్పటికైనా రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ యంత్రాంగానికి ఎవ్వరికి తెలియకుండా పర్యటిస్తేనే సమస్యలు తెలుస్తాయన్నారు. ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిరంతరం అధికార పార్టీతో పోరాటం చేస్తుందన్నారు. ఎప్పుడైనా ప్రజల తరపున నిలబడేదని కాంగ్రెస్ పార్టీయే అన్నారు. ఇప్పటికైనా కేంద్రంతో…
శీతాకాల పార్లమెంట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే సభ ప్రారంభం నుంచి విపక్షాలు కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వ్యవసాయ చట్టాలపై చర్చించాలంటూ నినదించారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పలు మార్లు సభ వాయిదా పడింది. వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో మరోసారి గందరగోళం ఏర్పడడంతో రాజ్యసభ చైర్మన్ 12 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఎలమరం కరీం – సీపీఎం, బినోయ్ విశ్వం –…
గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలను తీసుకవచ్చిన విషయం తెలిసిందే. అయితే చట్టాలు ఆమోదయోగ్యంగా లేవంటూ ఇటు ప్రతిపక్షాలు, అటు రైతులు దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశారు. అంతేకాకుండా దేశ రాజధాని ఢిల్లీలో సంవత్సరం పాటు రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకొని 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే నేడు శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ వ్యవసాయ చట్టాల…
సంక్షేమ పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ అప్పులు చేయడం అనివార్యమని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ అన్నారు. గుంటూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రూ.6 లక్షల కోట్లు అప్పులు చేసిందని, అయితే అభివృద్ధి జరగడం లేదని, జగన్ ఫెయిల్యూర్ సీఎం అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అప్పులు చేయని రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. జ్యోతిబా ఫూలే వంటి…
రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రైతులు ఓవైపు చస్తున్నా.. కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. రైతులకు చీడ పడితే ఏం చేయాలో తెలుసన్న ఆయన.. రైతులకు పట్టిన అతిపెద్ద చీడపీడ కేసీఆరే అని విమర్శించారు. ఒకప్పుడు వ్యవసాయం పండుగ అన్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు దండగ అంటున్నారో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. వ్యవసాయాన్ని…
వరి కుప్పల పై రైతుల చావులకు కేసీఆర్ బాధ్యత వహించాల్సిదేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. రైతుల కోసం నిర్వహించిన దీక్షలో ఆయన మాట్లాడుతూ… కేసీఆర్పై, బీజేపీ పైనా తీవ్ర విమర్శలను గుప్పించారు. వరి ధాన్యం కుప్పలపై రైతులు చనిపోవడంపై స్పందిస్తూ.. ఇవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలన్నారు. కేసీఆర్కు దమ్ము, ధైర్యం ఉంటే ప్రధాని అపాయింట్మెంట్ లెటర్ చూపెట్టాలన్నారు. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను అరిగోస పెడతున్న కేసీఆర్కు ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే…
రైతుల సమస్యలపై పీసీసీ తలపెట్టిన ఆందోళనలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. కేసీఆర్పై విమర్శల దాడి చేశారు. ప్రజలు ఎప్పుడు అభిమానిస్తే అప్పుడే అధికారంలోకి వస్తామని జానా రెడ్డి అన్నారు. పీసీసీ చేపట్టిన ఆందోళనకు అభినందలు చెబుతున్నాని ఆయన అన్నారు. రైతుల సమస్యలు పరిష్కారించాలని కేంద్ర, రాష్ర్టా ప్రభుత్వాలను హెచ్చరించారు. పదవుల కోసమే… ప్రభుత్వం వస్తోందనో… స్వాతంత్ర్య ఉద్యమం చేయడం లేదని.. రైతుల కోసం చేస్తున్నామని జానా అన్నారు.…
ఎత్తేసిన ధర్నా చౌక్లోనే కేసీఆర్ ధర్నా చేశారని మాజీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ సందర్భంగా వరి కొనుగోలు అంశం పై కాంగ్రెస్ నిర్వహిస్తున్న ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ అన్ని తప్పుడు మాటలు చెబుతున్నారన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో పూటకో మాట మారుస్తున్నాడని ఆయన ఆరోపించారు. గన్ని బ్యాగులు లేవు. హామాలీల సమస్యలు పరిష్కారం కాలేదు. ఇవేవి పట్టకుండా కేసీఆర్ తన స్వంత పనులు…
తెలంగాణలో స్థానిక సంస్థల స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీజేపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన కరీంనగర్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రెండు ప్రధాన పక్షాలు అభ్యర్థులను నిలబెట్టడం లేదని చెప్పడం జరిగిందని, టీఆర్ఎస్ అభ్యర్థులు గా భాను ప్రసాద్, ఎల్ రమణ లు ఉన్నారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నా ఈటల రాజేందర్…
శీతాకాల పార్లమెంట్ సమావేశాలు రేపు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు పార్లమెంటీరీ సమావేశాలు నిర్వహించుకుంటూ సమావేశాల్లో ప్రత్యర్థులపైన పన్నాల్సిన వ్యూహాలను రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బేజేపీ కూడా పార్లమెంటరీ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనుంది. ఈ సమావేశంలో పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలను పార్టీ నేతలు ఖరారు చేయనున్నారు. అంతేకాకుండా విపక్షాలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు నేతలు సమాయత్తం అవుతున్నారు. దీనితో పాటు సాయంత్రం 5గంటలకు రాజ్యసభ…