రోశయ్య మరణం రాష్ర్టానికి, రాష్ర్ట రాజకీయాలకు తీరని లోటని మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు అన్నారు. రోశయ్యకు నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రోశయ్య గౌరవ ప్రదమైన వ్యక్తి అని ఆయన అన్నారు. రోశయ్య ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా, మంత్రిగా ఏపీకి ఎన్నో సేవలు అందించారన్నారు. చాలామంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసి ఆర్థిక వ్యవస్థకే వన్నె తెచ్చిన వ్యక్తి అని కొనియాడారు. రోశయ్య పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను జనరల్ సెక్రటరీగా ఉన్నానని గుర్తు చేసుకున్నారు.…
సోనియాగాంధీకి రోశయ్య అత్యంత ఆప్తుడని… రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. కాసేపటి క్రితమే రోశయ్య పార్థివదేహానికి మల్లికార్జున ఖర్గే నివాళులు అర్పించారు. ఈ సందర్భంగామాట్లాడుతూ.. రోశయ్యతో నాకు మంచి సాన్నిహిత్యం ఉందని… కాంగ్రెస్ లో జాయిన్ అయిన దగ్గర నుండి అనేక పదవులకు వన్నెతెచ్చారని కొనియాడారు. రోశయ్యకి నివాళి అర్పించడం కోసం ఏఐసిసి అధ్యక్షులు సోనియాగాంధీ నన్ను ఇక్కడికి పంపించారన్నారు. ఎలాంటి కాంట్రవర్సీ లేని నాయకుడు రోశయ్య అని… అందర్నీ కలుపుకొని పోయే మనస్తత్వం…
రోశయ్య మరణం కాంగ్రెస్ నేతలను కలిచి వేసిందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. పీసీసీ, పీఏసీ జాయింట్ సమావేశంలో రైతు సమస్యలపై చర్చించాలని అనుకున్నామని, కానీ రోశయ్య మరణంతో ఆయన మరణం పైనే చర్చించామని షబ్బీర్ అలీ మీడియాకు తెలిపారు. రోశయ్య మరణం కాంగ్రెస్ నేతలను కలిచి వేసిందన్నారు.ఈ రోజు సమావేశంలో రోశయ్య సేవలు, మరణంపైనే చర్చించినట్టు తెలిపారు. రేపు గాంధీ భవన్ లో 11 నుండి 12 వరకు రోశయ్య పార్థివ దేహాన్ని వుంచనున్నట్టు…
ఆ పార్టీకి ఇప్పుడో తలనొప్పి వచ్చిపడింది. అదేదో రాజకీయ సమస్య అయితే ఓకే…! కానీ మహిళలను వేధించారన్న ఆరోపణలు కావడంతో.. ఒక్కరు కూడా పెదవి విప్పడం లేదట. సున్నితమైన సమస్యగా భావించి అంతా పిన్‌డ్రాప్ సైలెన్స్. ఇంతకీ ఏంటా పార్టీ? ఆరోపణలు ఉద్దేశ పూర్వకమా? ఇంకేదైనా రాజకీయం ఉందా? లెట్స్ వాచ్..! పీసీసీలో పెద్దలకు దగ్గరగా ఉండేవారిపై వేధింపుల ఆరోపణలు? తెలంగాణ కాంగ్రెస్‌లో గడిచిన వారం రోజులుగా నాయకులంతా ఒక్కటే చెవులు కొరుకుడు.. గుసగుసలు. హుజురాబాద్ ఉపఎన్నిక…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు ఏపీ పీసీసీ చీఫ్ శైలజా నాథ్ చురకలు అంటించారు. ఈసందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాహుల్‌గాంధీని విమర్శించే స్థాయి పీకేది కాదని అన్నారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉరుకోబోమన్నారు. ప్రశాంత్ కిషోర్‌ను ఓ బ్రోకర్‌గా అభివర్ణించారు. ప్రశాంత్ కిషోర్ నోరు అదుపులో పెట్టుకోవాలని లేదంటే కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహానికి బలికావాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు ఏంటో ప్రశాంత్‌కిషోర్‌కు ఏమైనా తెలుసా అంటూ మండిపడ్డారు. ఏపార్టీ డబ్బులు ఇస్తే..…
తెలంగాణలో ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే.. కాంగ్రెస్ పోటీ చేస్తోంది రెండు చోట్లే. మరి.. మిగిలిన నాలుగు స్థానాల్లో హస్తం వ్యూహం ఏంటి? పోటీకి దూరంగా ఉన్న జిల్లాల్లో ఎవరిపై గురి పెడుతోంది? లెట్స్ వాచ్..! ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం ఏంటి? స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న ఆరుచోట్లా క్యాంప్ రాజకీయాలు ఊపందుకున్నాయి. గెలిచే బలం ఉన్న పార్టీ సైతం ముందు జాగ్రత్త పడుతోంది. ఓటర్లుగా ఉన్న స్థానిక సంస్థల…
ఒమిక్రాన్ పై ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం తగదని ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈ సందర్భంగా లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. పోలియోకి వ్యాక్సిన్ ఎప్పుడు వచ్చింది. కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడు వచ్చిందని, కరోనాకు వేగంగా వ్యాక్సిన్ తీసుకొచ్చిన ఘనత మనదేన్నారు. ఇప్పటికే దేశంలో హర్‌ఘర్ దస్తక్ కార్యక్రమం ద్వారా దేశంలో ప్రతి పౌరునికి ఉచిత టీకాను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తు అధికారులను అప్రమత్తం చేస్తున్నామని, ప్రజలు కూడా అప్రమత్తంగా…
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కడియం శ్రీహరి మాటల దాడులను పెంచారు. ఆయన ఏకంగా కాంగ్రెస్, బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ నేతలను బేవకూఫ్‌లు అని సంబోధించారు. బీజేపీ రైతులపై చిత్తశుద్ధి ఉంటే యాసంగిలో ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు దమ్ము లేదని రాజకీయ పబ్బం గడుపుకోవడానికే రైతులను అడ్డం పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. పనిచేసే వారిని చేయనివ్వరు వారు…
కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిశారు. అనంతరం సమావేశ వివరాలను ఎంపీ కోమటి రెడ్డి మీడియాకు వెల్లడించారు. జాతీయ రహదారికి 930P నంబరు గల జై శ్రీరామ రహదారిని కేటాయించి DPRని ఆమోదించిందని.. వెంటనే పనులు ప్రారంభించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఈ సందర్భంగా కోమటిరెడ్డి కోరారు. అనంతరం కోమటి రెడ్డి మాట్లాడుతూ.. ORR జంక్షన్ గౌరెల్లి వద్ద నుండి భూధాన్ పోచంపల్లి -వలిగొండ –…
జమ్ముకాశ్మీర్‌లో ఆర్టికల్ 370ను పునరుద్ధరించాలంటే కాంగ్రెస్ వల్ల అయ్యే పని కాదని .. ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. ఎందుకంటే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 300 స్థానాల్లో గెలుపొందాలని, అది అసాధ్యమని అన్నారు. అధికరణ 370 రద్దుపై తన మౌనం గురించి జమ్మూ-కాశ్మీరులోని పూంఛ్ జిల్లా, కృష్ణఘాటి ఏరియాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, దీనిని కేవలం సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం మాత్రమే పునరుద్ధరించగలవని ఆయన పేర్కొన్నారు. ‘మేము సొంతంగా…