సోషల్ మీడియాలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వార్ నడుస్తోంది. యూపీలోని జెవార్‌లో నిర్మించ తలపెట్టిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 25న శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు బీజేపీ నేతలు షేర్ చేసిన ఫొటోలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. సోషల్ మీడియాలో ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. నోయిడాలో నిర్మించబోతున్న ఈ విమానాశ్రయం ఆసియాలోనే అతిపెద్దదని, దీని ద్వారా ఈ ప్రాంతానికి రూ. 35 వేల కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు లక్షమందికి ఉపాధి…
సీఎం కేసీఆర్, అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక.. దూరం పాటిస్తూ వస్తున్న కోమటిరెడ్డి. అనూహ్యంగా ఇవాళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన వరి దీక్షలో ప్రత్యక్షమయ్యారు… రేవంత్ శిబిరంలో కోమటిరెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. దీంతో.. పార్టీ కేడర్‌లో జోష్ కూడా పెరిగింది.. ఇక, ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా…
మూలిగే నక్కపై తాటి పండు పడటం అంటే ఇదే. కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ. అసలే దాని పరిస్థితి బాగా లేదు. దేశంలో ఎన్నడూ లేనంతగా బలహీన పడింది. తొలి నుంచి ఈశాన్య భారతం కాంగ్రెస్‌కు పెట్టని కోట. కానీ ఇప్పుడు అక్కడ ఖాళీ అవుతోంది. బలంగా ఉన్న ఏకైక రాష్ట్రం మేఘాలయ కూడా చేయి దాటి పోయింది. దాంతో ఈశాన్య రాష్ట్రాలలో హస్తం పని అయిపోయింది అనే భావన కలిగిస్తోంది. మేఘాలయలో 17 మంది కాంగ్రెస్…
ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆ నాయకుడు గతంలోనే ప్రకటించినా.. ఉపఎన్నికలో పోటీ చేయక తప్పలేదు. వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటారో లేదో తెలియదు. కానీ.. ఆయన ఇద్దరు తనయులు మాత్రం చెరో నియోజకవర్గాన్ని ఎంచుకుని.. కాలికి బలపం కట్టుకున్నట్టుగా తిరిగేస్తున్నారు. దీంతో పెద్దాయన దారెటు అని కేడర్‌లోనూ.. పార్టీలోనూ చర్చ మొదలైంది. వారసులను రంగంలోకి దించేశారా? కుందూరు జానారెడ్డి. చాలాసార్లు రాజకీయాలకు దూరంగా ఉంటానని చెబుతూ వచ్చారు ఈ మాజీ మంత్రి. 2018లో నాగార్జునసాగర్‌లో ఓడిన…
తెలంగాణలో అంపశయ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని అధిష్టానం ప్రకటించి ఊపిరి పోసిందని రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించిన నాటి నుంచి విముఖతతో ఉన్న సీనియర్ నేతల్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఒకరు. అయితే ఆనాటి నుంచి మొన్నటి హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల వరకు రేవంత్‌రెడ్డిపై కోమటిరెడ్డి వ్యతిరేకంగానే వ్యాఖ్యలు చేశారు. Also Read : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. వ్యవసాయంపై కమిటీ..…
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. కర్షకులకు అండగా కాంగ్రెస్ అంటూ కాంగ్రెస్ పార్టీ వరి దీక్షలు చేపట్టింది. ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో రాజకీయ క్రీడ ఆడుతున్నాయని, కార్పొరేట్ లకు భూముల అమ్మేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. ఖమ్మం జిల్లాలో వరి రైతుల పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్న చందంగా తయారైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.…
మేఘాలయ టీఎంసీ ఛీఫ్‌గా ముకుల్ సంగ్మా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 11 మంది ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (AITMC)లో మేఘాలయ ముఖ్యమంత్రి డాక్టర్ ముకుల్ సంగ్మా చేరారు. శుక్రవారం షిల్లాంగ్‌లో జరిగిన టీఎంసీ పార్టీ కొత్తగా ఏర్పడిన మేఘాలయ యూనిట్ తొలి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.మొదటి పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ముకుల్ సంగ్మాతో సహా మొత్తం 12 మంది శాసనసభ్యులు హాజరయ్యారని ఉమ్రోయ్ నియోజకవర్గ…
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు.. అధికార టీఆర్ఎస్కు అసలైన ప్రత్యామ్నాయం తామేనంటున్నారు.. అయితే, బీజేపీకి అంత సీనేలేదంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు… కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి సామాన్య ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదన్న ఆయన.. రాష్ట్రంలో ఎప్పటికీ బీజేపీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. Read Also: ఈటల సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్ ఆరిపోయే దీపం..! బీజేపీకి 80 సీట్లు కాదు…
రాష్ట్ర విభజన తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులకు పదవులు వచ్చాయి కానీ.. పవర్ రాలేదని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..230 ఓట్లు మెదక్‌లో కాంగ్రెస్‌కు ఉన్నాయన్నారు. గెలిచే ఓట్లు లేకున్నా నా భార్యను పోటీలో నిలబెట్టానని ఆయన తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పెట్టడం వల్లనే ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో హరీష్ రావు మాట్లాడుతున్నారు. మరి రెండు ఏళ్ల నుంచి ఎందుకు మాట్లాడలేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఉమ్మడి మెదక్‌లో ఒక్కో నియోజకవర్గానికి రెండు…