తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పై కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్‌చౌదరి తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేసేందుకు మోడీ, మమత ఒక్కటయ్యారని ఆరోపించారు. దేశంలో అసలు యూపీఏ లేదని మమత చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. దీదీ, బీజేపీ సంబంధాలు పాతవేనని… తనతో పాటు, పార్టీని, మేనల్లుడు అభిషేక్ బెనర్జీని కాపాడుకునేందు మోడీతో మమత లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ఇప్పటికే పలు మార్లు దీదీ మోడీ…
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం మమతా బెనర్జీ అంచనాలను పెంచింది. ఆ గెలుపు ఆమెను ప్రధాని పీఠంపై కన్నేసేలా చేసింది. వచ్చే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీకి అసలు సిసలు ప్రత్యర్థి తానే అని భావిస్తున్నారామె. ఆ భావనను ప్రజలలో స్థిరపరచేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకు, మొదట కాంగ్రెస్ పై పైచేయి సాధించాలని చూస్తున్నారు. అందుకే హస్తం పార్టీ అసంతృప్త నేతలకు గాలం వేస్తున్నారు. పొరుగున ఉన్న ఈశాన్య భారతం టార్గెట్‌గా కాంగ్రెస్‌ని ఖాళీ చేయిస్తున్నారు. అదే…
రాజకీయాల్లో నేతల మధ్య విమర్శలు, ఆరోపణలు సర్వసాధారణమైన విషమే.. అవి కొన్నిసార్లు శృతి మించి ఇంకా ముందుకు సాగిన సందర్భాలు కూడా లేకపోలేదు.. రాజకీయ నేతలు హత్యకు గురైన ఘటనలు ఎన్నో ఉన్నాయి. నేతల మధ్య రాజకీయాల్లోనైనా ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని అందరూ కోరుకునే విషయం. అయితే, తాజాగా ఓ ఎమ్మెల్యే హత్యపై ఇద్దరి మధ్య కుదిరిన డీల్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది… బీజేపీ ఎమ్మెల్యేను హత్య చేస్తే కోటి రూపాయలు ఇస్తానంటూ…
ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణలో ఇంకా స్పష్టత రాలేదు. ఓ వైపు అధికారి టీఆర్ఎస్ పార్టీ అధినేత ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర స్పష్టత ఇవ్వలేదంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. మరో వైపు తెలంగాణ బీజేపీ నేతలు వానాకాలంలో పండించిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అంటున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులును మోసం చేస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇప్పటికే కర్షకుల కోసం కాంగ్రెస్ అంటూ రైతులకు న్యాయం చేయాలని…
ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేయలేక డ్రామాలు ఆడుతోందని బీజేపీ నేతలు అంటుంటే.. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వలేదని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ నేతలు సైతం ధాన్యం కొనుగోళ్లు చేసిన రైతులకు న్యాయం చేయాలంటూ వరి దీక్షలకు కూడా దిగారు. తాజాగా మాజీ పీసీసీ ఉత్తమ్‌కుమార్ మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.…
తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు పెరగనున్న సంగతి తెలిసిందే. పల్లె వెలుగుకు 25 పైసలు, ఎక్స్‌ప్రెస్‌లు, ఇతర సర్వీసులకు 30 పైసలు పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ యాజమాన్యం ప్రతిపాదనలు పంపింది. తెలంగాణ సీఎం కేసీఆర్.. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే… కచ్చితంగా ఆర్టీసీ ఛార్జీల పెంపుకే.. సీఎం కేసీఆర్ మొగ్గు చూపే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే… ఆర్టీసీ ఛార్జీల పెంపుపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి… ట్విట్టర్ వేదికగా…
గడిచిన రెండేళ్లలో రాష్ర్టంలోని ప్రజాప్రతినిధులను పట్టించుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ర్టంలో ప్రజాప్రతినిధులను పట్టించుకోలేదు. నిధులు ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ఎమ్మెల్సీ అభ్యర్థులను పెట్టినందుకు వారిని గౌరవిస్తున్నారన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు లేవని ఆయన స్పష్టం చేశారు. జిల్లా నాయకులు, దామోదర్, గీత రెడ్డితో మాట్లాడి ఎమ్మెల్సీ అభ్యర్థిని…
కాంగ్రెస్‌లో అంతే..! ఒకరంటే ఇంకొకరికి గిట్టదు. నువ్వెంత అంటే.. నీకంటే తక్కువ..! నాకేంటి అనుకుంటారు. ఇప్పుడా ఆ సీన్ మారుతుందా? వస్తారని అనుకున్న వాళ్లు డుమ్మా కొడుతున్నారా? రారని అనుకున్నవాళ్లు వచ్చి ఆశ్చర్యపరుస్తున్నారా? ఎంపీ కోమటిరెడ్డి వస్తారని ఎవరికీ తెలియదా? తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన వరి దీక్ష కాంగ్రెస్‌లో అనేక రాజకీయాలకు వేదికైంది. దీక్షకు పీసీసీ కసరత్తు చేసినప్పుడు పార్టీ కార్యక్రమాలకు రెగ్యులర్‌గా వచ్చేవాళ్లు వస్తారు అని అనుకున్నారు.ఈ జాబితాలో లేని వ్యక్తి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.…
వడ్ల కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ సర్కార్ ల మధ్య పంచాయితీ తెగడం లేదు. నిన్న కేంద్రం తీరుపై సీఎం కేసీఆర్ మండిపడగా… తాజాగా కేంద్రంపై రెచ్చిపోయారు హరీష్‌రావు.వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాద్ధాంతం చేస్తుందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లలో మొత్తం కలిపి ఎన్ని వడ్లు కొన్నారో… ఒక్క సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత అన్ని వడ్లు కొనుగోలు చేసామో తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ హయాంలో ఉన్న కొనుగోలు…
దేశ రాజధాని ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ ర్యాలీకి సిద్ధం అవుతోంది కాంగ్రెస్ పార్టీ.. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో దేశంలో పెరుగుతోన్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణాన్ని వ్యతిరేకిస్తూ ‘జన జాగరణ్ అభియాన్’ పేరుతో కాంగ్రెస్ మెగా ర్యాలీని చేపట్టనుంది. పెరిగిన ధరలకు నిరసనగా నవంబర్ 14 నుంచి 29 వరకు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ “జనజాగరణ్ అభియాన్” నిర్వహించింది.. ఇక, దానికి ముగింపుగా ఢిల్లీలో డిసెంబర్ 12వ తేదీన భారీ ర్యాలీ ఉంటుందని ప్రకటించింది..…