తిరిగి కాంగ్రెస్ గూటికి డీఎస్ రాక వెనక బలమైన లెక్కలు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఊహాగానాలకు తెరదించారు ఆ సీనియర్ పొలిటీషియన్. మళ్లీ పాత గూటికే వెళ్తున్నారు. రీఎంట్రీ వెనక కీలక లెక్కలే ఉన్నాయట. భారీ అంచనాలు వేసుకుని.. పైవాళ్ల దగ్గర ఓ మాట అనేసుకుని.. జాయినింగ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసేశారు. ఇంతకీ ఎవరా నాయకుడు? ఆయన వేసుకున్న లెక్కలేంటి?
కాంగ్రెస్‌లోకి తిరిగి ఎందుకొస్తున్నారు?
Also Read
- Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
- Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు... ఆ సీట్లు దక్కేదెవరికి..?
- Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా... ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి...?
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
ధర్మపురి శ్రీనివాస్. ఇలా పూర్తి పేరుగా కంటే.. DS అంటే తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పొలిటీషియన్. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీతో ప్రయాణించిన ఆయన.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత మనసు మార్చుకున్నారు. టీఆర్‌ఎస్‌లో చేరి రాజ్యసభకు వెళ్లారు శ్రీనివాస్. ఎంత వేగంగా గులాబీ కండువా కప్పుకొన్నారో.. అంతే వేగంగా టీఆర్‌ఎస్‌లో తామరాకుపై నీటి బిందువయ్యారు. ఎంపీగా పదవీకాలం దగ్గర పడుతున్న సమయంలో ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు DS. ఢిల్లీలో నేరుగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యి.. పాత పార్టీలోకి వచ్చేందుకు లైన్ క్లియర్ చేసుకున్నారు. డీఎస్ చేరికపై ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతోపాటు రాష్ట్ర కాంగ్రెస్‌లో కొందరి స్పందన ఎలా ఉన్నా.. ఆయన తిరిగి కాంగ్రెస్‌లోకి ఎందుకొస్తున్నారన్నది జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అనేక ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి.
పెద్ద కుమారుడు సంజయ్ రాజకీయ భవిష్యత్‌పై బెంగ ?
తన ఇద్దరు కుమారులను రాజకీయంగా సెటిల్ చేసేందుకు.. కాంగ్రెస్‌లో కీలకంగా ఉన్నప్పుడే DS ప్రయత్నించారు. కానీ.. అవేమీ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇంతలో ఒక కుమారుడు బీజేపీ నుంచి ఎంపీ అయ్యారు. పెద్ద కుమారుడు సంజయ్ మేయర్‌గా పనిచేసినా.. ఇంకా నిలదొక్కుకోలేదు. తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు 4 నెలల క్రితం పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని కలిశారు సంజయ్. ఇంకా ఫైనల్ కాలేదు. సంజయ్ మాత్రం వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట. పెద్ద కుమారుడు చేస్తున్న పనుల వెనక DS ఆశీసులు ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాల అనుమానం.
సంజయ్‌ను ఎమ్మెల్యేగా చూడాలనే ఆశ..?
DS తిరిగి కాంగ్రెస్‌లోకి రావడం వెనక.. సంజయ్‌ను పొలిటికల్‌గా పికప్ చేయడమేనన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. జిల్లాలో మళ్లీ కీలక పాత్ర పోషిస్తారని అనుకుంటున్నారు. టీఆర్ఎస్‌తో విభేదాలు తర్వాత సైలెంట్‌గా ఉన్న DS.. తన వ్యూహాలను జిల్లా రాజకీయాల్లో అమలు చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ కేడర్‌తో టచ్‌లోనే ఉన్నారట. పట్టుకోల్పోకుండా అందరితో మాట్లాడుతున్నట్టు సమాచారం. సంజయ్‌ను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా చూడాలన్నది DS బలమైన కోరికగా ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా DS ఎంట్రీపై మరో చర్చా ఉంది.
మరో కుమారుడు బీజేపీ ఎంపీ.. డీఎస్ కాంగ్రెస్ అంటే కేడర్ ఒప్పుకొంటుందా?
కాంగ్రెస్ పార్టీని వీడాక మానసికంగా ఇబ్బంది పడినట్టు సన్నిహితులకు చెప్పి వాపోయారట DS. మొదటి నుంచీ ఉన్న పార్టీ కావడంతో.. కాంగ్రెస్‌పై ఆ మామకారం చావలేదని.. తాను కన్నుమూసిన నాడు.. కాంగ్రెస్ కండువా తన మీద ఉండాలని చెప్పేవారట. ఆ అభిమానమే ఇప్పుడు ఘర్‌వాపసీకి కారణమని కొందరి వాదన. అయితే ఒక కుమారుడు బీజేపీ ఎంపీగా ఉన్న టైమ్‌లో తండ్రి కాంగ్రెస్‌లో కొనసాగుతానంటే జిల్లా కేడర్ ఒప్పుకుంటుందా అన్నది ప్రశ్న. తెలంగాణ ఏర్పాటయ్యాక కాంగ్రెస్‌కు అవసరమైన టైమ్‌లో DS వెళ్లిపోయారనే ప్రచారం పార్టీలో ఉంది. ఈ రెండు విషయాలను రీఎంట్రీలో ఎలా ఓవర్ కమ్ చేస్తారన్నది చర్చ. వీటన్నింటి మధ్య కాంగ్రెస్‌లోకి DS రాక… జిల్లా రాజకీయాలను మలుపు తిప్పుతుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?