మళ్లీ కాంగ్రెస్ గూటికి డీఎస్..నేతలు గరం.. గరం !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ నేత, మాజీ పీసీసీ చీఫ్ డీ. శ్రీనివాస్… కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. చాలా కాలంగా టీఆర్ఎస్ లో అసంతృప్తితో ఉన్న డీఎస్.. కాంగ్రెస్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే… డీఎస్ రాకపై నిజామాబాద్ జిల్లా తో పాటు..రాష్ట్రంలోని సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ దగ్గర అభ్యంతరం వ్యక్తం చేయడంతో డీఎస్ కి క్లియరెన్స్ రాలేదు. అప్పట్లో డీఎస్ చేరిక అలా వాయిదా పడింది.ప్రస్తుతం సోనియా గాంధీ పార్టీ బాధ్యతలు చూస్తుండడంతో , ds మరోసారి తన ప్రయత్నాలు సాగించారు. గతంలో పార్టీలో సోనియా గాంధీకి ఉన్న సన్నిహితుల్లో డీఎస్ కూడా ఒకరు కావడంతో…మేడంని కలిసి మనసులో మాట చెప్పడం, ఆమె ఓకే చెప్పేయడం తో పార్టీలో చేరికకు క్లియరెన్స్ వచ్చినట్టు అయ్యింది.
డీఎస్ పార్టీలో చేరే అంశాన్ని, సోనియా గాంధీ ..పార్టీ నిర్మాణ బాధ్యతలు చూస్తున్న కేసీ వేణుగోపాల్ కి సమాచారం ఇవ్వడంతో, అయన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి టాగూర్ కి తెలిపారు. ఈ అంశం పై పార్టీ చీఫ్ రేవంత్, సిఎల్పీ నేత భట్టి లకు కబురు పంపారు. ఉదయం ఏఐసీసీ కి రావాలని పిలిచారు. పార్లమెంట్ నడుస్తున్న నేపద్యంలో సభ విరామ సమయంలో పార్టీ నాయకులను సోనియా లేదంటే రాహుల్ గాంధీలు కలిసే అవకాశం ఉంది.
Also Read
అయితే డీఎస్ చేరికపై రాష్ట్ర నాయకుల తో మాట్లాడి… డీఎస్ కి కాంగ్రెస్ కండువా కప్పనున్నట్లు సమాచారం. అయితే నిజామాబాద్ జిల్లా కు చెందిన కొందరు నాయకులు డీఎస్ చేరికపై కొంత అసంతృప్తి తో ఉన్నారు. ఇదే అంశాన్ని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి టాగూర్ కి విన్నవించారు. అయితే డీఎస్ చేరిక అంశం సోనియా గాంధీ నిర్ణయం కాబట్టి దీనిపై పెద్దగా వివాదం ఉండే అవకాశం లేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి డీఎస్ మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. దీంతో అసంతృప్త నేతలు ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Ameesha Patel: ‘ఆంటీ’ అంటూ ట్రోల్.. హార్దిక్‌తో లింకప్ రూమర్స్‌పై అమీషా స్ట్రాంగ్ కౌంటర్!
-
TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
-
Uttam Kumar Reddy: పాదయాత్ర అంటే జనాలు నవ్వుతారు.. కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు.!
-
Auto Drivers Meet: ఆటో కార్మికులతో కీలక భేటీ.. సంక్షేమ బోర్డు, మీటర్ ఛార్జీలపై చర్చ!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
ట్రెండింగ్
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!